Begin typing your search above and press return to search.

బాదుడే బాదుడు... కొడుకు పెళ్లి వేళ అంబానీపై ట్రోల్స్

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇంట మరికొన్ని రోజుల్లో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Jun 2024 6:22 AM GMT
బాదుడే బాదుడు... కొడుకు పెళ్లి వేళ  అంబానీపై ట్రోల్స్
X

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇంట మరికొన్ని రోజుల్లో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహం జూలై 12న జరగనుంది. రెండు నెలల క్రితం గుజరాత్ లోని జాం నగర్ లో వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి.

ఆ వేడుకలకు పెద్ద ఎత్తున సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖలతో పాటు దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు విచ్చేశారు. ఈ క్రమంలో రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ముంబైలో జరిగాయి. ఇక మరో రెండు వారాల్లో జరగనున్న వివాహం కోసం వెడ్డింగ్ కార్డును ఆలయం రూపంతో బాక్స్ లాగా తయారుచేయించడం ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఆ సంగతి అలా ఉంటే... జియో తన మొబైల్ సేవల టారిఫ్ లను సుమారు 12 నుంచి 27% పెంచుతోంది. ఈ మేరకు పెరిగిన రేట్లు జూలై 3 నుంచి అమలులోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా స్పందించిన జియో ఇన్ ఫో కాం ఛైర్మన్ ఆకాశ్ అంబానీ... సుమారు రెండున్నరేళ్ల తర్వాత టారిఫ్ లు పెంచుతున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా సుమారు అన్ని ప్రీపెయిడ్ పథకాల రేట్లనూ కంపెనీ పెంచింది. ఈ క్రమంలో 1 జీబీ డేటా యాడ్ ఆన్ ప్యాక్ ధర రూ.15 ఉండగా.. 27% పెంచింది. వార్షిక రీఛార్జ్ ప్లాన్ లను 20-21%కి పెంచింది. మరోపక్క రోజుకి 2జీబీ, అంతకు మించి డేటా లభించే పథకాలకు అన్ లిమిటెడ్ 5జీ సదుపాయాన్ని వర్తింపచేస్తారని తెలిపారు. అయితే ఇలా రేట్లు పెంచడంపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.

అవును... రిలయన్స్ జియో రేట్లను భారీగా పెంచడంపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా... "కొడుకు పెళ్లి ఖర్చు మొత్తాన్ని దేశ ప్రజల నెత్తిన పాడేస్తున్నారా అంకుల్" అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇదే సమయంలో... "ఎన్నికలు అయిపోయాయిగా... ఇక బాదుడే బాదుడు" అని కామెంట్ చేస్తున్నారు. రేట్లు తర్వాత పెంచిచ్చు కాస్త సిగ్నల్ పరిస్థితిని పరిగణలోకి తీసుకోమని స్పందిస్తున్నారు.