రూ.50 నోట్ల పై కొత్త సంతకం.. ఎవరిదంటే?
కొత్తగా విడుదలయ్యే రూ.50 నోట్ మీద ఇప్పటివరకు ఉన్న సంతకానికి బదులుగా.. కొత్త సంతకంతో రానుంది.
By: Tupaki Desk | 13 Feb 2025 4:25 AM GMTకొత్తగా విడుదలయ్యే రూ.50 నోట్ మీద ఇప్పటివరకు ఉన్న సంతకానికి బదులుగా.. కొత్త సంతకంతో రానుంది. ఇప్పటివరకు రిజర్వుబ్యాంక్ పాత గవర్నర్ శక్తికాంత దాస్ సైన్ తో చలామనీలో ఉండేవి. అందుకు బదులుగా తాజాగా కొత్త గవర్నర్ సంతకంగా నోట్లు విడుదలైనట్లుగా రిజర్వు బ్యాంక్ పేర్కొంది. గత ఏడాది ఆర్ బీఐ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ మల్హోత్రా సంతకం చేసి రూ.50 నోట్లను విడుదల చేస్తున్నట్లుగా రిజర్వు భ్యాంక్ వెల్లడించింది.
ఇప్పటికే మార్కెట్ లో ఉన్న పాత నోట్లు యథావిధిగా చెల్లుబాటు కానున్నాయి. ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన మల్హోత్రా సంతకంతో నోట్లు జారీ కావటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. గత ఏడాది డిసెంబరులో ఆయన భారత రిజర్వు బ్యాంక్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. మహాత్మా గాంధీ సిరీస్ లో ప్రింట్ అయ్యే కొత్త సిరీస్ ను ఆయన సంతకంతోనే రిలీజ్ చేసినట్లుగా చెబుతున్నారు.
ఇక కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా విషయానికి వస్తే.. ఆయన కాన్పూర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంఫ్యూటర్ సైన్స్ లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం 56 ఏళ్లున్న ఆయన.. అమెరికాలోని ప్రిన్సటన్ వర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు. 1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ లో ఐఏఎస్ అధికారిగా ఎంపికైన ఆయన.. గడిచిన ముఫ్పై మూడేళ్లుగా విద్యుత్.. ఫైనాన్స్.. పన్నులు.. సమాచార సాంకేతికత.. గనులతో సహా పలు రంగాల్లో ఆయన కీలక భూమిక పోషించి.. మూడు నెలల క్రితమే ఆయన భారత రిజర్వు బ్యాంక్ కొత్త గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు.