'యానిమల్' బుల్లెట్ల బండెక్కిన నవ దంపతులు!
ఈ సినారేలో దేవుడు ఫోటో కంటే ముందు అభిమాన హీరోకే అక్కడ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.
By: Tupaki Desk | 12 Dec 2024 10:10 AM GMTయువతపై సినిమాల ప్రభావం ఉందో లేదో క్లారిటీ లేదు గానీ కొత్తగా పెళ్లిళ్లు చేసుకునే వారిపై మాత్రం ఆ ప్రభావం ఉందని చెప్పాలి. ఎందుకంటే అభిమాన హీరో ఫోటో ముందు పెట్టుకుని పెళ్లిళ్లు చేసుకున్న దంపతులు చాలా మంది ఉన్నారు. ఈ సినారేలో దేవుడు ఫోటో కంటే ముందు అభిమాన హీరోకే అక్కడ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇలాంటి రకరకాల స్టంట్లు ఎన్నో ఉన్నాయి.
సాధారణంగా ఇలాంటి సంఘటనలు తమిళనాడు.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చోటు చేసుకుంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటే వెలుగులోకి వచ్చింది. అయితే వాటికి చాలా భిన్నంగా ఉంటుంది. వివాహం అనంతరం రిసెప్షెన్ ఏర్పాటు ఉంటుంది . అనంతరం ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ క్రమంలో వధువు..వరుడిని వేదిక వద్దకు తీసుకొచ్చేందుకు సాధారణంగా అందగా అలంకరించిన గుర్రపు బళ్లు లేదా రధ వాహనం లేదా? అందంగా డెకరేట్ చేసిన ఖరీదైన కార్లు వాడుతుంటారు.
వాటి లోపల పెళ్లి కొడుకు-కూతురు కూర్చుని ఉంటారు. కానీ ఓ జంట అందుకు భిన్నంగా ఆలోచించింది. కార్లు... గుర్రపు బళ్లు రొటీన్ గా భావించి ఏకంగా యానిమల్ సినిమాలోని రణబీర్ కపూర్ బుల్లెట్ బండిపైనే వచ్చారు. కొత్త బండి పై ఇద్దరు కూర్చోగా పొగలు కక్కుతూ ఆ బండి నడుస్తుంది. ముందు బుల్లెట్లు దూసుకొచ్చేలా హోల్స్ చూడొచ్చు. ఆ సినిమాలో ఉన్న బండి డిజైన్ ని ఉన్నది ఉన్నట్లు గా దించారు.
దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టంట వైరల్ అవుతుంది. ఇప్పటి వరకూ ఏ నవ దంపతులు ఇలాంటి బండిపైకి ఎక్కింది లేదు. ఇది వైరల్ గా మారడంతో కొత్తగా పెళ్లి చేసుకునే ప్యాషన్ ప్రియులు ఇలా ఎందుకు చేయకూడదని ఆలోచించే అవకాశం లేకపోలేదు సుమీ.