వైరల్ పిక్... సౌత్ ఇండియా మోస్ట్ స్టైలిష్ సీఎం!!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆయన దుస్తుల ఎంపికలో భిన్నమైన శైలిని కలిగి ఉన్నారు.
By: Tupaki Desk | 9 Dec 2024 4:16 AM GMTతెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం హుస్సేన్ సాగర్ పరిసరాల్లో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటుచేసిన ఏరోబాటిక్ ప్రదర్శన ప్రత్యక్షంగా వీక్షించిన నగరవాసులను ఆకట్టుకుంది. అంచనాలకు తగ్గట్టుగా 9 విమానాలు, సుమారు 25 నిమిషాల పాటు ఉత్కంఠభరిత ప్రదర్శన ఇచ్చింది.
ఈ విన్యాసాలను ట్యాంక్ బండ్ పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి సీఎం రేవంత్ తో పాటు పలువురు మంత్రులు వీక్షించారు. వీరంతా నెక్లెస్ రోడ్, ట్యాం బండ్ పై కూర్చుని వీక్షించేలా అధికారులు కుర్చీలు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో సీఎం రేవంత్ స్టైలిష్ లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
అవును... సాధారణంగా రాజకీయ నాయకులు ఖద్దర్ దుస్తులు ధరిస్తుంటారు! ఉదాహరణకు ఏపీ సీఎం చంద్రబాబు పసుపు రంగు, ఖాకీ రంగు మిక్సింగ్ చేసినట్లుండే దుస్తుల్లో కనిపిస్తారు. ఇక వైఎస్ జగన్.. తెల్ల చొక్కా, ఖాకీ ఫ్యాంట్ దుస్తుల్లో ఓ ట్రెండ్ సెట్ చేశారు. దీంతో... ఆయన అభిమానులు చాలా మంది అదే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడం మొదలుపెట్టారు!
అయితే... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆయన దుస్తుల ఎంపికలో భిన్నమైన శైలిని కలిగి ఉన్నారు. సాధారణంగా బ్లాక్ ఫ్యాంట్ వైట్ షర్ట్ లో కనిపించే రేవంత్.. పలు సందర్భాల్లో మాత్రం స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ క్రమంలో నెక్లెస్ రోడ్డులో కనిపించినప్పుడు డిఫరెంట్ లుక్ లో కనిపించారు.
ఇందులో భాగంగా... స్టైలిష్ బ్రౌన్ టీ-షర్ట్, బ్లాక్ ఫ్యాంట్, షూస్, స్టైలిష్ సన్ గ్లాసెస్ ధరించి అర్బన్ లుక్ లో కూల్ గా కనిపించారు. దీంతో... దీనికి సంబంధించిన ఫోటోలు చూసిన వారు సౌత్ ఇండియాలోనె మోస్ట్ స్టైలిష్ సీఎం అంటూ ఆన్ లైన్ వేదికగా స్పందిస్తున్నారు. ఈ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
దక్షిణాది రాష్ట్రాల్లోని కీలక నేతలు, సీఎం లలో చంద్రబాబు, జగన్ తో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం విజయన్, తమిళనాడు సీఎం స్టాలిన్ లు రెగ్యులర్ దుస్తుల్లోనే కనిపిస్తారనే సంగతి తెలిసిందే!