లోకేష్ నియోజకవర్గంలో కొత్త చిక్కు.. ఏం చేస్తారు.. ?
దాదాపు 70 వేల మందికిపైనే.. నిరుద్యోగులు మంగళగిరిలో ఉన్నారని తాజాగా అధికారులు ఆయనకు నివేదించారు.
By: Tupaki Desk | 10 Dec 2024 4:30 PM GMTమంత్రి నారా లోకేష్ సొంత నియోజకవర్గం మంగళగిరిలో కొత్త చిక్కు తెరమీదికి వచ్చింది. నియోజకవ ర్గంలో నిరుద్యోగులకు ఉపాధి చూపిస్తానని నారా లోకేష్ ఎన్నికలకు ముందు ప్రచారం చేశారు. ఎంత మంది ఉంటే అంతమందికీ ఉపాధి చూపిస్తానన్నారు. ఈ క్రమంలోనే తాజాగా స్కిల్ సెన్సస్(నైపుణ్య గణన) చేపట్టారు. నియోజకవర్గంలోని ప్రతిమండలం, గ్రామం, వీధిలో ఉన్న నిరుద్యోగులను గుర్తించారు. అయితే.. వీరి సంఖ్య తాను ఊహించిన దానికంటే కూడా.. ఎక్కువగా ఉండడంతో నారా లోకేష్ నివ్వెర పోయారు.
దాదాపు 70 వేల మందికిపైనే.. నిరుద్యోగులు మంగళగిరిలో ఉన్నారని తాజాగా అధికారులు ఆయనకు నివేదించారు. వీరిలోనూ మహిళలు ఎక్కువగా ఉన్నారని, వీరంతా కూడా.. ఉన్నత విద్యను చదువుకు న్నవారేనని చెప్పారు. కానీ, ఉపాధి, ఉద్యోగాలు లేకపోవడంతో ఇంటికే పరిమితం అయ్యారని స్కిల్ సెన్సస్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా 40 ఏళ్ల వయసున్న యువతీ యువకులు ఎక్కువగా ఉన్నారని తేలింది. వీరంతా కూడా.. నారా లోకేష్ తమకు ఉద్యోగాలు కల్పిస్తారన్న ఆశతో ఉన్నారని కూడా గుర్తించారు.
వాస్తవానికి రాష్ట్రంలో ఏటా4 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని.. ఎన్నికలకు ముందు నారా లోకేష్ చెప్పుకొచ్చారు. అయితే.. ఈ సంఖ్య రాష్ట్రం మొత్తాన్నీ దృష్టి లో పెట్టుకుని ఆయన చేశారు.కానీ, ఇప్పుడు ఒక్క మంగళగిరిలోనే 70 వేల మంది ఉన్నారని తాజా లెక్కలు తేల్చి చెబుతున్నాయి. బీటెక్‌లు చదివిన మహిళలు కూడా.. ఇంట్లోనే ఉంటున్నారని, వీరికి అవకాశాలు కల్పించాల్సి ఉందని నివేదిక స్పష్టం చేసింది. దీంతో నారా లోకేష్‌కు ఈ సమస్య పెద్ద ఇబ్బందిగానే మారనుంది.
ఇప్పటికిప్పుడు కాకపోయినా.. కనీసంఏడాదిలో అయినా.. వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను చూపిం చాల్సి ఉంది. మరీ ముఖ్యంగా మహిళలకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. అయితే.. దీనిపై టీడీపీ సహా.. నారా లోకేష్ ధీమాగానే ఉన్నారు. అమరావతి పనులు పుంజుకుంటే.. ఎలాంటి ఇబ్బందులూ ఉండవని వారు చెబుతున్నారు. రాజధాని పనులు సాగితే.. ఉపాధికల్పన జరుగుతుందని అంటున్నారు. కాబట్టి మంగళగిరి నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నారు. మరి ఎలా ముందుకు సాగుతారో చూడాలి.