Begin typing your search above and press return to search.

ఏపీలో మందుబాబులకు సరికొత్త కష్టం!

ఇదే సమయంలో బాగా పేరున్న బ్రాండ్లను, పాత బ్రాండ్లను అందుబాటులోకి తేనుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   25 Sep 2024 1:30 PM GMT
ఏపీలో మందుబాబులకు సరికొత్త కష్టం!
X

ఏపీలో వచ్చే నెల నుంచి నూతన మద్యం పాలసీ రానున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఊరూ, పేరు లేని బ్రాండ్లు తెచ్చి పెట్టారని మందుబాబులు గగ్గోలు పెట్టిన వేళ, కూటమి ప్రభుత్వం పూర్తిగా పాత తరహా మద్యం విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇదే సమయంలో బాగా పేరున్న బ్రాండ్లను, పాత బ్రాండ్లను అందుబాటులోకి తేనుందని అంటున్నారు.

ఇప్పటికే పలు టాప్ బ్రాండ్ లకు సంబంధించిన మద్యం ఏపీకి చేరిందని కథనాలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా టెండర్ల ప్రక్రియ కొనసాగాల్సి ఉంది! అన్నీ సక్రమంగా జరిగి కొత్త ప్రైవేటు మద్యం దుకాణాల్లో కొత్త మద్యం, చంద్రబాబు చెప్పినట్లు నాణ్యమైన మద్యం అందుబాటులోకి రావాలంటే అక్టోబరు 4వ తేదీ వరకూ సమయం పట్టొచ్చని అంటున్నారు.

దీంతో... అక్టోబరు 4 ఎప్పుడు వస్తుందా అని మద్యపాన ప్రియులు ఎదురుచూస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో ప్రస్తుతానికి ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల వల్ల మందుబాబులకు కొత్త కష్టం వచ్చిందని అంటున్నారు. ఇందులో భాగంగా... చాలా మద్యం దుకాణాల్లో "స్టాకు లేదు" అనే బోర్డులు దర్శనమిస్తున్నాయంట.

అవును... రాష్ట్రంలో అక్టోబర్ నెల నుంచి కొత్త మద్యం పాలసీలో భాగంగా తక్కువ ధరకే లిక్కర్ అందుబాటులోకి రానున్న వేళ మందుబాబులకు కొత్త చిక్కొచ్చి పడింది. ఇందులో భాగంగా చాలా మద్యం షాపుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయట. ఇప్పటికే డిపోల నుంచి సరుకు సరఫరా నిలిచిపోయిందని.. ఉన్న నిల్వలన్నీ అమ్మాలనే ఆదేశాలు ఉండటంతో అంతా క్లియర్ చేశామని చెబుతున్నారంట.

దీంతో... రూ.130, రూ.150 ధరలకు దొరికే బ్రాండ్లు దాదాపు చాలా మద్యం షాపుల్లో అమ్ముడైపోయాయని.. ప్రస్తుతానికి బీరు ప్రస్థావన లేదని.. రూ.220 ఆపైన ధరలున్న మద్యం మాత్రమే అందుబాటులో ఉందని.. అది కూడా క్వార్టర్ బాటిల్స్ కాకుండా హాఫ్ బాటిల్స్, ఫుల్ బాటిల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారని అంటున్నారు.