Begin typing your search above and press return to search.

అమరావతికి గేమ్ చేంజర్ గా కొత్త రైల్వే లైన్?

ఇక కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా అమరావతిని ఆశీర్వదిస్తోంది.

By:  Tupaki Desk   |   24 Oct 2024 1:33 PM GMT
అమరావతికి  గేమ్ చేంజర్ గా కొత్త  రైల్వే లైన్?
X

ఏపీ సీఎం చంద్రబాబు కలల రాజధాని అమరావతి దశ తిరుగుతోంది. దానికి సంబంధించి వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఒక వైపు ప్రపంచ బ్యాంకు నిధులు వస్తునాయి. హడ్కో నిధులు కూడా వచ్చే చాన్స్ ఉంది.


ఇక కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా అమరావతిని ఆశీర్వదిస్తోంది. ఇదే నెల మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి చంద్రబాబు కేంద్ర రైల్వే మంత్రి అశ్వైని వైష్ణవ్ ని ఇలా కలసి వచ్చారో లేదో అంతలోనే శుభవార్త కేంద్రం వినిపించింది.

అమరావతికి కొత్త రైలు మార్గాన్ని కేంద్రం ప్రకటించింది. మొత్తం 57 కిలోమీటర్ల రైలు మార్గంతో అమరావతి రైలు ప్రాజెక్ట్ సాగనుంది. దీని కోసం కేంద్రం ఏకంగా 2,245కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ఈ విషయాన్ని కెంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ప్రకటించడంవిశేషం.

కేంద్ర మంత్రి ప్రకటించిన ఈ కొత్త రైల్వే లైన్ హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు అమరావతి రజధనితో అనుసంధానం చేస్తుంది. అంటే మెగా సిటీస్ తో అమరావతి ఆవిధంగా కనెక్టివిటీని పెంచుకుంటుంది అన్న మాట. అవన్నీ రాజధానులే. అలా అమరావతి కూడా మెగా కాపిటల్ గా మారుతోందని సంకేతాలు వచ్చేశాయన్న మాట.

ఈ కొత్త రైల్వే లైన్ వల్ల అమరావతి రాజధాని నుంచి ఉత్తర, మధ్య దక్షిణ ప్రాంతాలతో సహా భారతదేశంలోని వివిధ ప్రాంతాల మధ్య రైల్ కనెక్టివిటీ పూర్తిగా పెరుగుతుంది. దాంతో చాలా సులువుగా దేశంలోని అన్ని ప్రాంతాలలో అమరావతి పేరు మారుమోగనుంది.

అంతే కాదు ఈ కొత్త రైల్వే లైన్ వల్ల అమరావతిని మచిలీపట్నం, కృష్ణపట్నం కాకినాడ ఓడరేవులకు మరింత అనుసంధానిస్తుందని కూడా చెబుతున్నారు. ఈ ఓడరేవు ప్రాంతాలలో బ్రహ్మాండమైన రవాణా సదుపాయాలు కూడా ఏర్పడతాయని అంటున్నారు.

వీటికి తోడు అన్నట్లుగా అమరావతి కేవలం రాజధానిగానే కాకుండా టూరిజం హబ్ గా కూడా మారుతుందని అంటున్నారు. ఈ కొత్త రైల్వే లైన్ ద్వరా అమరావతి స్థూపం, ధ్యాన బుద్ధ ప్రాజెక్ట్, అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉండవల్లి గుహలు వంటి ప్రాంతాలకు కూడా దేశం నలుమూలల నుంచి ప్రజలు చాలా ఈజీగా వచ్చే వీలు ఉంటుంది. దాంతో అమరావతి కేవలం రాజధానిగా కాకుండా టూరిజం స్పాట్ గా కొత్త వెలుగులు అందిస్తుందని అంటున్నారు.

ఏ విధంగా చూసుకున్నా ఈ కొత్త రైల్వే లైన్ అమరావతికి ఒక అద్భుతమైన భవిష్యత్తుగా చెబుతున్నారు. ఇది గేమ్ చేంజర్ గా మారి రేపటి ఏపీకి అమరావతి పవర్ ఫుల్ కాపిటల్ గా చెప్పబోతోంది. సరికొత్త చరిత్ర రాయబోతోంది

ఇదంతా కూడా విజనరీగా పేరు గడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సాగుతున్న అభివృద్ధి అని అంటున్నారు. చంద్రబాబు కేంద్రంతో సయోధ్య నెరుపుతూ అతి తక్కువ కాలంలో సాధిస్తున్న ప్రగతిగా కూడా అభివర్ణిస్తున్నరు.

అమరావతి రాజధాని కోసం కేంద్రం కూడా ఎంతో సాయం చేస్తోంది అంటే అది చంద్రబాబు గొప్పతనంగానే చూడాలని అంటున్నారు. అమరావతి రాజధాని అన్నది దేశంలో రానున్న రోజులలో మారు మోగేలా భారీ యాక్షన్ ప్లాన్ తో సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి వరసగా శుభవార్తలు అందుతున్నాయి. ఇది ఒక విధంగా పదేళ్ల పాటు విభజన సమస్యలతో తల్లడిల్లిన అయిదు కోట్ల ఏపీ జనానికి అతి పెద్ద ఊరటగా కూడా చెబుతున్నారు.