Begin typing your search above and press return to search.

బార్ & రెస్టారెంట్.. రెస్టారెంట్స్ విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!

ఈ సమయంలో బెల్ట్ షాపుల వ్యవహారంపైనా ఏపీలోని చర్చ నడుస్తుంది.

By:  Tupaki Desk   |   29 Oct 2024 5:05 AM GMT
బార్ & రెస్టారెంట్.. రెస్టారెంట్స్  విషయంలో  ఏపీ సర్కార్  కీలక నిర్ణయం!
X

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నూతన లిక్కర్ పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో బెల్ట్ షాపుల వ్యవహారంపైనా ఏపీలోని చర్చ నడుస్తుంది. అయితే.. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని, లిక్కర్ షాపులో కూడా ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా క్షమించేది లేదని ఏపీ సర్కార్ సీరియస్ గా స్పందిస్తోంది.

ఇందులో భాగంగా... ఎమ్మార్పీ ఉల్లంఘించే బెల్టు షాపులకు మద్యం విక్రయించే దుకాణాలకు మొదటి తప్పు కింద రూ.5 లక్షల జరిమానా విధించాలని సూచించారు. తర్వాత కూడా అవే తప్పులు చేస్తూ నిబంధనల్ని ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దు చేయాలని స్పష్టం చేశారు చంద్రబాబు. ఈ సమయంలో విశాఖలో అర్ధరాత్రి వరకూ సాగే వ్యాపారంపైనా కీలక ఉత్తర్వ్యులు వెలువడ్డాయి!

అవును... రెస్టారెంట్లు, హోటళ్ల సమయాలకు సంబంధించి కొత్త సూచనలు జారీ అయ్యాయి. ఈ మేరకు విశాఖలోని పోలీస్ కమీషనర్ కార్యాలయం. ఇందులో భాగంగా... ఏపీ షాప్స్ అండ్ అస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ సెక్షన్ 7(22), 15 (2) ప్రకారం బార్ & రెస్టారెంట్లు మినహా మిగిలిన హోటళ్లు, రెస్టారెంట్లు వంటివి అర్ధరాత్రి వరకూ తెరిచి ఉండడానికి మార్గదర్శకాలను జారీ చేసిందని వెల్లడించింది!

వాస్తవానికి... ఏపీలో హోటళ్లు, రెస్టరెంట్లు మొదలైన ఫుడ్ జోన్ లకు రాత్రి 10:30 గంటల వరకూ మాత్రమే అనుమతి ఉంది. ప్రధానంగా నేరాల రేటును నియంత్రించడంతో పాటు కోవిద్ - 19 మహమమరి తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఏపీలో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఈ మేరకు నిబంధనలు సడలించారు!

దీంతో... వ్యాపారులు, సామాన్య ప్రజానికంతోపాటు ప్రధానంగా నైట్ డ్యూటీలు చేసేవారు హర్షం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.