Begin typing your search above and press return to search.

ఏప్రిల్ 1 విడుదల.. మీ సోషల్ మీడియా సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లోకి

ఈ సారి మాత్రం భారీ మార్పునే తీసుకొస్తోంది. అది మనందరం వాడే సోషల్ మీడియా విషయంలో కావడమే ఇక్కడ విశేషం.

By:  Tupaki Desk   |   28 March 2025 3:30 PM
ఏప్రిల్ 1 విడుదల.. మీ సోషల్ మీడియా సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లోకి
X

ఆన్ లైన్ ఆర్థిక కార్యకలాపాలు మొదలైన దగ్గర నుంచి ప్రతి నెల 1 వ తేదీన రూల్స్ మారిపోతున్నాయి. క్రెడిట్ కార్డుల వాడకం దగ్గరనుంచి లోన్ సంబంధిత వ్యవహారాల వరకు.. 1వ తేదీ నుంచి మార్పులు వస్తున్నాయి. తాజాగా ఏప్రిల్ 1 రానుంది. అంటే భారత దేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలుకానుంది. ఈ సారి మాత్రం భారీ మార్పునే తీసుకొస్తోంది. అది మనందరం వాడే సోషల్ మీడియా విషయంలో కావడమే ఇక్కడ విశేషం.

వచ్చే ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను విధానం అమల్లోకి రానుంది. పాత నిబంధనల్లో మార్పులు చేయడంతోపాటు.. ప్రస్తుత సాంకేతికతకు అనుగుణంగా కొత్త ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు చేశారు. దీని ప్రకారం కొత్త టెక్నాలజీతో ట్యాక్స్ అమలును తాజాగా ఉంచేందుకు వీలవుతుంది.

క్రిప్టో కరెన్సీ వంటి వర్చువల్ కరెన్సీపై ఓ కన్నేసి ఉంచుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాటల్లో చెప్పాలంటే డిజిటల్ ఖాతాల నుంచి వచ్చే ఆధారాలు అధికారులకు కోర్టులో పన్ను ఎగవేతను నిరూపించడానికి, పన్ను ఎగవేత మొత్తాన్ని కచ్చితంగా లెక్కించడానికి ఆధారాలను అందిస్తాయి.

కొత్త బిల్లు అధికారులకు వాట్సాప్, టెలిగ్రాం, ఈ మెయిల్స్ వంటి డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ ఫామ్‌ లను యాక్సెస్ చేసే హక్కు కల్పిస్తుంది. దీనికితోడు ఆర్థిక లావాదేవీలను దాచడానికి ఉపయోగించే వ్యాపార సాఫ్ట్‌ వేర్, సర్వర్‌ లను కూడా ప్రభుత్వం యాక్సెస్ చేసేందుకు వీలుంటుంది. ‘వెల్లడించని ఆదాయం’ కింద వర్చువల్ డిజిటల్ ఆస్తులను కవర్ చేస్తుంది. ఇందులో డిజిటల్ టోకెన్లు, క్రిప్టో కరెన్సీలు, క్రిప్టో గ్రాఫిక్ వంటివి ఉంటాయి.

శోధన, స్వాధీన కార్యకలాపాల సమయంలో వర్చువల్ డిజిటల్ స్థలాలను యాక్సెస్ చేయడానికి ఆదాయపు పన్ను అధికారులకు అనుమతిస్తుంది. ఇ మెయిల్ సర్వర్లు, సోషల్ మీడియా ఖాతాలు, ఆన్‌లైన్ పెట్టుబడి, ట్రేడింగ్ ప్లాట్‌ ఫారంలు, ఆస్తి యాజమాన్య వివరాలను నిల్వ చేసే వెబ్‌ సైట్‌ లను కూడా కవర్ చేస్తుంది. పన్ను దర్యాప్తులో భాగంగా డిజిటల్ ఖాతాల తనిఖీ కోసం యాక్సెస్ కోడ్‌ లను ఓవర్‌రైడ్ చేసే అధికారాన్ని కూడా ఇది అధికారులకు ఇస్తుంది.