Begin typing your search above and press return to search.

అక్టోబర్ 14 డాక్టర్స్ డెడ్ లైన్... ఆర్జీ కర్ ఆసుపత్రిలో కొత్త టెన్షన్!

ఈ వ్యవహారం పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది.

By:  Tupaki Desk   |   13 Oct 2024 11:30 PM GMT
అక్టోబర్ 14 డాక్టర్స్  డెడ్  లైన్... ఆర్జీ కర్  ఆసుపత్రిలో కొత్త టెన్షన్!
X

ఆర్జీ కర్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థిని హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ప్రధానంగా... ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలంటూ జూనియర్ డాక్టర్స్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు అపూర్వ మద్దతు లభిస్తోంది.

అవును... దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఆర్జీకర్ ఆస్పత్రిలోని వైద్యవిద్యార్థిని హత్యాచార ఘటన ఇప్పుడు మరో మలుపు తీసుకుంది! ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలంటూ జూనియర్ డాక్టర్ లు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో.. ఈ దీక్షకు అపూర్వ మద్దతు లభిస్తుంది.

ఇప్పుడు ఈ వ్యవహారం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయని అంటున్నారు. దీనికి కారణం ఈ జుడా ల దీక్షకు మద్దతుగా సీనియర్ డాక్టర్లు తమ సంఘీభావం ప్రకటించారు. ఈ క్రమంలో సుమారు 200 మందికి పైగా సీనియర్ వైద్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర సర్కార్ కు కొత్త టెన్షన్ గా మారింది.

ఈ నేపథ్యంలో మరో బిగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఇప్పటికే 200 మంది సీనియర్ వైద్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేయగా.. తాజాగా మరో 77మంది వైద్యులు అందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కల్యాణీ జే.ఎన్.ఎం. ఆస్పత్రికి చెందిన 77 మంది వైద్యులు రాజీనామాలకు సిద్ధమయ్యారు.

ఈ మేరకు పశ్చిమబెంగాల్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ కు వారు ఓ ఈ-మెయిల్ పంపారు. అక్టోబర్ 14లోపు తమ డిమాండ్లు పరిష్కరించకపోతే తమ విధులను నిలిపేస్తామని హెచ్చరించారు. నిరవధిక నిరాహార దీక్ష సంఘీభావం తెలపడంతోపాటు.. జుడాల ఆరోగ్యం క్షీణిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇదే సమయంలో... బాధితురాలికి న్యాయం చేయడంతోపాటు ఆరోగ్య కార్యదర్శ్ని ఎన్.ఎస్. నిగంను తక్షణమే తొలగించాలని.. పనిచేసె చోట భద్రతాచర్యలు తీసుకోవాలని.. మొదలైన డిమాండ్లను అక్టోబర్ 14లోగా పరిష్కరించాలని ఆ మెయిల్ లో హెచ్చరించారు. దీంతో... సోమవారం (అక్టోబర్ 14) ఏమి జరగబోతుందనేది ఆసక్తిగా మారింది.