భారత్ పర్యటనలో న్యూయార్క్ మేయర్ లంచం తీసుకున్నారా?
ఇదే సమయంలో... 2022లో మేయర్ కావడానికి ముందు అతను నగరంలోని బ్రూక్లిన్ బరో అధ్యక్షుడిగా ఉన్న కాలానికి సంబంధించిన అనేక ఆరోపణల్లో.. భారతదేశ పర్యటన గురించి కూడా ఉండటం గమనార్హం.
By: Tupaki Desk | 27 Sep 2024 5:24 AM GMTఅమెరికాలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్.. లంచం, మోసం, అక్రమ విదేశీ ప్రచార విరాళాలను అంగీకరించడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు ఫెడరల్ ప్రాసిక్యూటర్ ల ద్వారా అభియోగాలు మోపబడ్డాయి. ఈ ఆరోపణల్లో ఒకటి.. అతను భారతదేశానికి వెళ్లిన పర్యటనకు సంబంధించినది అని చెబుతుండటం గమనార్హం.
అవును... న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్.. చట్టవిరుద్ధమైన ప్రచార విరాళాలను, టర్కిష్ జాతీయుల నుంచి విలాసవంతమైన ప్రయాణాలను అంగీకరించారని అభియోగాలు మోపారు యూఎస్ ప్రాసిక్యూటర్లు. ప్రస్తుతం ఈ విషయం అతిపెద్ద నగర ప్రభుత్వాన్ని గందరగోళానికి గురి చేసిందని అంటున్నారు.
టర్కిష్ ఎయిర్ లైన్స్ లో తనకు, తన దేశీయ భాగస్వామికీ ఎకనమీ క్లాస్ టిక్కెట్ కొనుగోలు చేసిన తర్వాత.. అతను బిజినెస్ క్లాస్ కు అప్ గ్రేడ్ చేయడానికి అంగీకరించాడని.. దాని విలువ సుమారు 13,000 డాలర్లని ప్రాసిక్యూటర్ లు నొక్కి చెప్పారని విడుదలైన అభియోగాలి తెలిపాయి.
ఇదే సమయంలో ఇస్తాంబుల్ లోని సెయింట్ రేగిస్ హోటల్ లోని లగ్జరీ సూట్ లో రెండు రాత్రులు బస చేయడానికి 600 డాలర్లు మాత్రమే చెల్లించారని.. ఇది వాస్తవ 7,000 డాలర్ల కంటే చాలా తక్కువని తెలిపారు. ఈ సమయంలో ప్రాసిక్యూటర్లు చట్టవిరుద్ధంగా అతను పొందిన మొత్తాలను లక్ష డాలర్లుగా తేల్చారు!
ఇదే సమయంలో... 2022లో మేయర్ కావడానికి ముందు అతను నగరంలోని బ్రూక్లిన్ బరో అధ్యక్షుడిగా ఉన్న కాలానికి సంబంధించిన అనేక ఆరోపణల్లో.. భారతదేశ పర్యటన గురించి కూడా ఉండటం గమనార్హం. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది! దీనిపై స్పందించిన మేయర్.. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఖండించారు.
ఇక గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో స్పందించిన న్యూయార్క్ లోని సదరన్ డిస్ట్రిక్ట్ న్యాయవాది డామియన్ విలియమ్స్... మేయర్ తన 2021 ప్రచారం కోసం అక్రమ నిధులను తీసుకోవడానికి విదేశీ పౌరులతో సంబంధాలను పెంచుకున్నారని ఆరోపించారు. ఇక ఈ నేరం రుజువైతే మేయర్ కు 45 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక మేయర్ అడమ్స్ రాజీనామా చేసినా.. లేదా, అతని పదవీకాలం వచ్చే ఏడాది ముగిసేలోపు తొలగించబడినా.. ప్రజా న్యాయవాది జుమానే విలియమ్స్ అతని స్థానంలో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.