Begin typing your search above and press return to search.

ఎన్నారైల కోసం కొత్త ఆధార్ నిబంధనలు!

ఈ మేరకు ఆధార్ నమోదు, అప్‌ డేట్‌ నిబంధనలను సవరించడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఆర్డినెన్స్ జారీ చేసింది.

By:  Tupaki Desk   |   1 Feb 2024 3:13 PM GMT
ఎన్నారైల కోసం కొత్త ఆధార్  నిబంధనలు!
X

భారతదేశంలో నివాసముంటున్న వారు.. దేశం వెలుపల నివాస ముంటున్న ప్రవాసులు తమ తమ ఆధార్ కార్డ్‌ ని అప్‌ డేట్ చేయాలనుకుంటే.. ఇందులో భాగంగా చిరునామా, మొబైల్ నంబర్ లేదా మరి ఏదైనా మార్చాలనుకుంటే ఇది సరైన సమయం అనే భావించాలి. ఈ మేరకు ఆధార్ నమోదు, అప్‌ డేట్‌ నిబంధనలను సవరించడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఆర్డినెన్స్ జారీ చేసింది.

అవును... ఆధార్‌ ను నమోదు చేయడానికి, అప్‌ డేట్ చేయడానికి కొత్త ఫారంలు జారీ చేయబడ్డాయి. ఎవరైనా కొత్త ఆధార్ కార్డ్ పొందాలనుకున్నా.. లేక, అప్‌ డేట్ కార్డ్ పొందాలనుకున్నా.. ఇప్పుడు వారు తమ కొత్త దరఖాస్తును పూరించాలి! ఈ సమయంలో స్వదేశంలో నివాసం ఉంటున్న భారతీయులు, ఎన్నారైలు ప్రత్యేక ఫారం నింపాల్సి ఉంటుంది!

వాస్తవంగా.. కొత్త నిబంధనల కారణంగా ఇప్పుడు పేరు, చిరునామా మొదలైన వాటిని అప్‌ డేట్ చేయడం చాలా సులభం అనే భావించాలి. తాజాగా విడుదలైన కొత్త నిబంధనల ప్రకారం... సెంట్రల్ ఐడెంటిటీ డేటాలో సమాచారాన్ని అప్‌ డేట్‌ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఇందులో వెబ్‌ సైట్ ద్వారా ఆన్‌ లైన్‌ లో ప్రక్రియను పూర్తి చేయడం ఒక ప్రక్రియ కాగా... లేదా ఆధార్ ఎన్‌ రోల్‌మెంట్ కేంద్రానికి వెళ్లి చేయించుకోవడం మరొకటి!!

కాగా... పాత నిబంధనల ప్రకారం... ఆధార్ కార్డ్‌ లో చిరునామా, ఇతర వివరాలను ఆన్‌ లైన్‌ లో అప్‌ డేట్ చేసే సౌకర్యం ఉంది కానీ... ఇతర అంశాలను అప్‌ డేట్ చేయడానికి మాత్రం అవకాశం ఉండేది కాదు. అందుకోసం.. ఆధార్ ఎన్‌ రోల్‌ మెంట్ కేంద్రాలను స్వయంగా సందర్శించాల్సి ఉండేది. అయితే... తాజాగా వెలువడిన కొత్త నిబంధనల ప్రకారం మాగ్జిమం సమాచారాన్ని ఆన్‌ లైన్‌ లో కూడా అప్‌ డేట్ చేసుకోవచ్చు.

ఎన్నారైలకు ప్రత్యేక దరఖాస్తు!:

భారతదేశం వెలుపల నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు (ఎన్నారై) ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌ డేట్ కోసం ఫారం-2ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఈ క్రమంలో 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, భారతీయ చిరునామా కలిగిన ఎన్నారైలు ఫారం-3ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక విదేశీ అడ్రస్ లతో ఉన్న ఎన్నారైల పిల్లలు ఫారం-4ని ఉపయోగించవచ్చు.