Begin typing your search above and press return to search.

నో ఐపీసీ.. ఇకపై అంతా బీఎన్ఎస్.. అమల్లోకి వచ్చిన కొత్త చట్టం!

మొన్నటి వరకు ఉన్న ఇంగ్లిషు పేర్ల స్థానంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన హిందీ పేర్లను జీర్ణించుకోవటం.. అలవాటుగా మార్చుకోవటం కాస్తంత ఇబ్బందే

By:  Tupaki Desk   |   2 July 2024 5:33 AM GMT
నో ఐపీసీ.. ఇకపై అంతా బీఎన్ఎస్.. అమల్లోకి వచ్చిన కొత్త చట్టం!
X

ఏళ్లకు ఏళ్లు. దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా (150 ఏళ్లుగా) అమల్లో ఉన్న చట్టాలు మారిపోయి.. నిన్నటి (సోమవారం, జులై 1) నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు అమల్లో ఉన్న సుపరిచితమైన ఇండియన్ పీనల్ కోడ్ స్థానం (ఐపీసీ)లో ఇప్పుడు ‘భారతీయ న్యాయ సంహిత’గా మారటం తెలిసిందే. ఐపీసీ కాస్తా ఇప్పుడు బీఎన్ఎస్ గా మారింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సైతం ‘భారతీయ నాగరిక్ సురక్ష సంహిత’గా మారింది. ఇంతకాలం అలవాటైన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కాస్తా ‘భారతీయ సాక్ష్య అధినియమ్’గా మారింది.

మొన్నటి వరకు ఉన్న ఇంగ్లిషు పేర్ల స్థానంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన హిందీ పేర్లను జీర్ణించుకోవటం.. అలవాటుగా మార్చుకోవటం కాస్తంత ఇబ్బందే. అయినప్పటికీ చట్టం మారింది. కొత్త చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి.. తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. ఇదంతా ఒక్క పేర్లకే పరిమితం కాలేదు. సెక్షన్లు కూడా మారిపోయాయి. సినిమాల్లో కానీ.. ఇతర సందర్భాల్లో కానీ.. కొన్ని అలవాటైన సెక్షన్లు ఉంటాయి. అలాంటి సెక్షన్లు మొత్తం సమూలంగా మారిపోయాయి.

హత్యా నేరానికి వాడే ఐపీసీ సెక్షన్ 302 ఇప్పుడు తన నెంబరును మార్చేసుకుంది. ఈ నేరానికి ఇకపై బీఎన్ఎస్ సెక్షన్ 103కు మారింది. చీటింగ్ నేరం అన్నంతనే 420 నెంబరు చప్పున గుర్తుకు వస్తుంది. దాని నెంబరు కూడా మారింది. అదిప్పుడు సెక్షన్ 318లోకి వస్తుంది. దేశ ద్రోహానికి 124ఏగా ఉండేది. అదిప్పుడు 152కు మారింది. పరువు నష్టానికి సెక్షన్ 499 ఉండేది దాన్ని 356కు మారిపోయింది. అత్యాచార నేరాన్ని సెక్షన్ 375 కింద విచారించేవారు. అది కాస్తా 63కు ఛేంజ్ అయ్యింది. గ్యాంగ్ రేప్ నేరాన్ని సెక్షన్ 376డి కింద విచారించేవారు. దాన్ని కాస్తా సెక్షన్ 70(1) పరిధిలోకి తీసుకొచ్చారు. ఇలా అన్ని సెక్షన్లు మారాయి.

కొన్ని కీలక సెక్షన్లు మారి వాటి స్థానే వచ్చిన కొత్త సెక్షన్లను చూస్తే..

1. 302 IPC = 103 BNS

2. 304(A) IPC = 106 BNS

3. 304(B) IPC = 80 BNS

4. 306 IPC = 108 BNS

5. 307 IPC = 109 BNS

6. 309 IPC = 226 BNS

7. 286 IPC = 287 BNS

8. 294 IPC = 296 BNS

9. 509 IPC = 79 BNS

10. 323 IPC = 115 BNS

11. R/W 34 IPC = 3(5) BNS

12. R/W 149 = R/W 190 BNS

13. 324 IPC = 118(1) BNS

14. 325 IPC = 118(2) BNS

15. 326 IPC = 118(3) BNS

16. 353 IPC = 121 BNS

17. 336 IPC = 125 BNS

18. 337 IPC = 125 BNS(A)

19. 338 IPC = 125 BNS(B)

20. 341 IPC = 126 BNS

21. 353 IPC = 132 BNS

22. 354 IPC = 74 BNS

23. 354(A) IPC = 75 BNS

24. 354(B) IPC = 76 BNS

25. 354(C) IPC = 77 BNS

26. 354(D) IPC = 78 BNS

27. 363 IPC = 139 BNS

28. 376 IPC = 64 BNS

29. 284 IPC = 286 BNS

30. 286 IPC = 288 BNS (రూ.5వేల ఫైన్)

31. 290 IPC = 292 BNS (రూ.వెయ్యి ఫైన్)

32. 294 IPC = 296 BNS

33. 447 IPC = 329 (3) BNS

34. 448 IPC = 329 (4) BNS

35. 392 IPC = 309 BNS

36. 411 IPC = 317 BNS

37. 420 IPC = 318 BNS

38. 382 IPC = 304 BNS

39. 442 IPC = 330 BNS

40. 445 IPC = 330 BNS

41. 447 IPC = 330 BNS

42. 448 IPC = 331 BNS

43. 494 IPC = 82 BNS

44. 498 (A) IPC = 85 BNS

45. 506 IPC = 351 BNS

46. 509 IPC = 79 BNS (పెట్టి కేసులు)

47. 9(I), 9(II) = 112 BNS

కొత్త చట్టానికి సంబంధించి కొన్ని కీలక అంశాల్ని చూస్తే..

- ఇండియన్ పీనల్ కోడ్-IPC స్థానంలో భారతీయ న్యాయ సంహిత-BNS

- క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌-CRPC స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-BNSS

- ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌-IEA స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం-BSA చట్టాలు

- భారతీయ న్యాయ సంహిత చట్టంలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం పదం

- ఎవరైన అరెస్టయితే 14రోజుల్లోపు మాత్రమే కస్టడీ కోరే ఛాన్స్

- ఛార్జిషీట్ దాఖలు తర్వాత 40రోజులల్లో తీర్పు, 60 రోజుల్లో అభియోగాలు నమోదు

- ఫోరెన్సిక్‌ నిపుణులచే ఆధారాలు సేకరించాలి

- 24 గంటల్లోనే FIR నమోదు చేయాలి

- 14 రోజుల్లోనే ఈ- కేసులను కొలిక్కి తేవాలి

- అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని మహిళా పోలీసు అధికారి నమోదు చేయాలి

- ఆ బాధితురాలి వైద్య నివేదికలు ఏడు రోజుల్లోనే సిద్ధం చేయాలి

- పిల్లలను కొనడం, అమ్మడాన్ని కూడా కొత్త చట్టాల ప్రకారం తీవ్రమైన నేరం

- మైనర్‌పై సామూహిక అత్యాచారం చేస్తే జీవిత ఖైదు లేదా మరణశిక్ష

- చరాస్తులను, స్థిరాస్తులను పోలీసులు స్వాధీనం చేసుకునే అధికారం

- మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేయాలి

- బాధితుల వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలి

- మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాలి

- అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియోల ద్వారా కేసు

- పోక్సో కేసుల్లో మాత్రం బాధితురాళ్ల వాంగ్మూలాలు పోలీసులే కాకుండా మహిళా ప్రభుత్వ అధికారి ఎవరైనా నమోదు చేయవచ్చు

- క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్‌ సిస్టం. దేశవ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లు అనుసంధానం

- డిజి లాకర్‌ను ఇంటర్ ఆపరబుల్‌ క్రిమినల్ జస్టిస్ సిస్టం ICJSకు అనుసంధానం. ఆధారాలు ఎవరూ కూడా మాయం చేయలేని వ్యవస్థ.

- అనుమానాస్పద వస్తువులు జప్తు చేసినప్పుడు 48గంటల్లో కోర్టులో సమర్పించాలి

- బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు. మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, దివ్యాంగులు,15 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేదు తాము ఉండే చోటే పోలీసుల సాయం.

- ఫిర్యాదుపై పోలీసులు 3రోజుల్లోగా ఫిర్యాదుదారుల సంతకాల సేకరణ

- దర్యాప్తు, న్యాయవిచారణ సమన్లు ఎస్ఎంఎస్ ద్వారా జారీ

- గెజిటెడ్ అధికారి సమక్షంలో వీడియో ద్వారా సాక్ష్యం

- బాధితులకు, నిందుతులకు ఉచితంగా ఎఫ్‌ఐఆర్‌ కాపీ.

- పోలీస్ రిపోర్ట్, ఛార్జిషీట్‌, స్టేట్‌మెంట్లు, ఇతర డాక్యుమెంట్ల 2వారాల్లో పొందే ఛాన్స్.