Begin typing your search above and press return to search.

కొత్త తరహా క్రైం: బీకేర్ ఫుల్.. మీ అమ్మాయి గురించి ఇలాంటి కాల్ రావొచ్చు

భైంసా మండలం ఇలేగాంకు చెందిన వెంకటేశ్ కు ఒక కుమార్తె ఉంది. ఆమె గురుకుల పాఠశాలలో చదువుతోంది.

By:  Tupaki Desk   |   12 Aug 2024 4:38 AM GMT
కొత్త తరహా క్రైం: బీకేర్ ఫుల్.. మీ అమ్మాయి గురించి ఇలాంటి కాల్ రావొచ్చు
X

బెదిరింపులకు దిగటం.. భయానికి గురి చేయటం.. ఆలోచనలు ముందుకు సాగకుండా ఒత్తిడి పెట్టటం.. విచక్షణ కోల్పోయేలా చేయటం.. ముందు ఈ టెన్షన్ నుంచి బయటపడితే చాలన్నట్లు బిహేవ్ చేయటం లాంటివి సైబర్ నేరగాళ్ల లక్షణాలు. తాము టార్గెట్ చేసినోళ్లను భయంతో వణికేలా చేసి.. ఆ వెంటనే దాని నుంచి బయటపడేందుకు ఎంతకైనా సిద్ధం కావటం.. లక్షలాది రూపాయిల్ని పోగొట్టుకోవటం చూస్తున్నదే. ఇందుకోసం ఎప్పటికప్పుడు వారు కొత్త తరహా స్క్రిప్టును సిద్ధం చేసుకుంటూ ఉంటారు. తాజాగా మరో కొత్త తరహా ఎత్తుగడకు తెర తీశారు. తాజాగా భైంసా మండలంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం తరహాలో మీకు.. మీ అమ్మాయి గురించి కానీ మీ అబ్బాయి గురించి కానీ ఫోన్ కాల్ రావొచ్చు. కంగారు పడకుండా కేర్ ఫుల్ గా ఉండండి. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో అస్సలు పడొద్దు. ఇంతకూ అసలేం జరిగిందంటే..

భైంసా మండలం ఇలేగాంకు చెందిన వెంకటేశ్ కు ఒక కుమార్తె ఉంది. ఆమె గురుకుల పాఠశాలలో చదువుతోంది. అక్కడి హాస్టల్ లోనే ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ‘మీ అమ్మాయిని డ్రగ్స్ అమ్ముతుండగా పట్టుకున్నాం. మేం చెప్పిన చోటుకు రావాలి. లేదంటే మీ కూతుర్ని కాల్చేస్తాం’ అని చెప్పారు. కాస్తంత నివ్వెరపోయిన వెంకటేశ్.. ఎలా జరిగింది? నేను ఉదయమే మా అమ్మాయితో మాట్లాడి వచ్చానని చెప్పటంతో.. వెంటనే కాల్ కట్ అయ్యింది.

దీంతో.. షాక్ కు గురైన వెంకటేశ్ వెంటనే గురుకులం ప్రిన్సిపల్ కు ఫోన్ చేసి విషయం చెప్పగా.. అదంతా అబద్ధమని.. ఇప్పటికి మీ అమ్మాయి గురుకులంలో ఉందని చెప్పటంతో.. ఇదంతా ఎవరో తనను బెదిరింపులకు గురి చేసేందుకు కాల్ చేశారని ఆయన గ్రహించి.. రిలాక్స్ అయ్యారు. తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవటంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఈ తరహాలో మీకు ఫోన్ రావొచ్చు. అనవసర కంగారు పడకుండా.. స్థిమితంగా ఉండి ఇలాంటి బెదిరింపుగాళ్లను బలంగా ఎదుర్కోవాల్సిందే.