Begin typing your search above and press return to search.

జియో నుంచి కొత్త వైర్ లెస్ ఇంటర్నెట్... డెటైల్స్ ఇవే!

అవును... రిలయన్స్ 46వ సర్వసభ్య సమావేశంలో ఆ సంస్థ అధినేత ముఖేష్‌ అంబానీ... వైర్‌ లెస్‌ ఇంటర్నెట్ సర్వీస్‌ జియో ఎయిర్‌ ఫైబర్‌ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

By:  Tupaki Desk   |   17 Sep 2023 3:00 AM GMT
జియో నుంచి కొత్త వైర్  లెస్  ఇంటర్నెట్... డెటైల్స్  ఇవే!
X

సెప్టెంబర్‌ 19 వినాయక చవితి సందర్భంగా ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో వైర్‌ లెస్‌ ఇంటర్ నెట్ సర్వీస్‌ "జియో ఎయిర్‌ ఫైబర్‌" ప్రారంభించనుంది. ఈ జియో ఎయిర్ ఫైబర్ అనేది ఒక పోర్ట్‌ బుల్‌ వైర్‌ లెస్‌ ఇంటర్నెట్ సర్వీస్. ఇది 1.5 జీబీపీఎస్‌ వేగంతో పనిచేస్తుంది. వైఫై 6కి సపోర్ట్‌ చేయడంతో పాటు ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫైర్‌ వాల్ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. తాజాగా దీనికి సంబంధించిన వివరాలను ముఖేష్‌ అంబానీ వెల్లడించారు.

అవును... రిలయన్స్ 46వ సర్వసభ్య సమావేశంలో ఆ సంస్థ అధినేత ముఖేష్‌ అంబానీ... వైర్‌ లెస్‌ ఇంటర్నెట్ సర్వీస్‌ జియో ఎయిర్‌ ఫైబర్‌ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇళ్లు, ఆఫీసుల్లో వినియోగించేలా పోర్ట్‌ బుల్‌ సైజుల్లో దీన్ని తయారుచేసినట్లు తెలిపారు. తద్వారా యూజర్లు ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్ సౌకర్యం పొందొచ్చని అన్నారు.

ఈ క్రమంలో సెప్టెంబర్‌ 19 వినాయక చవితి సందర్భంగా అందుబాటులోకి రానున్న ఈ జియో ఎయిర్‌ ఫైబర్‌ ను తల్లిదండ్రులు నియంత్రించొచ్చని వెల్లడించారు. ఇందులో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫైర్‌ వాల్ వంటి ఫీచర్స్‌ ఉన్నాయని తెలిపారు. ఇది హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి 5జీని ఉపయోగిస్తుందని వెల్లడించారు.

ఇక ఈ ఎయిర్ ఫైబర్ మిగిలిన వివారాళ్లోకి వెల్తే... సాంప్రదాయ ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్‌ లతో పోలిస్తే దీని స్పీడ్‌ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా వినియోగదారులు గరిష్టంగా 1 జీబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ ను వినియోగించుకోవచ్చు. ఇదే సమయలో జియో ఎయిర్‌ ఫైబర్‌ కాంపాక్ట్ మాత్రమే కాకుండా.. సెటప్ చేయడం చాలా సులభమని జియో చెబుతుంది.

జియో ఎయిర్‌ ఫైబర్‌ ప్లగ్ అండ్ ప్లే చేయడానికి రూపొందించబడిందని.. యూజర్ ఫ్రెండ్లీ, కస్టమర్‌ లకు అందుబాటులో ఉంటుందని.. దీనికి ప్రొఫెషనల్ ఇన్‌స్టాలేషన్ అవసరం లేదని జియో ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ధర విషయానికొస్తే... దీని ధర దాదాపు రూ. 6,000 వరకూ ఉండొచ్చని తెలుస్తుంది.