Begin typing your search above and press return to search.

పాత పంచాయ‌తీల‌తో కొత్త పార్టీ ఫైట్‌.. చిత్రం బ్రో!

కొత్త సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో కొత్త పార్టీ ప‌రుగులు పెడుతుంద‌ని కూడా లెక్క‌లు వేసుకుంటారు.

By:  Tupaki Desk   |   29 Dec 2023 3:01 PM GMT
పాత పంచాయ‌తీల‌తో కొత్త పార్టీ ఫైట్‌.. చిత్రం బ్రో!
X

ఏపీలో కొత్త‌గా ఆవిర్భ‌వించిన పార్టీ. పైగా మాజీ ఐపీఎస్ అధికారి ఏర్పాటు చేసిన పార్టీ. దీంతో స‌హ‌జంగానే అంచ‌నాలు భిన్నం గా ఉంటాయి. కొత్త విష‌యాలు.. కొంగొత్త అంశాలు.. ప్ర‌జ‌ల అభిలాష‌ల‌ను అర్థం చేసుకుని ఈ కొత్త పార్టీ విజృంభిస్తుంద‌ని అంద రూ అనుకుంటారు. కొత్త సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో కొత్త పార్టీ ప‌రుగులు పెడుతుంద‌ని కూడా లెక్క‌లు వేసుకుంటారు. అయితే.. ఎన్నో ఆశ‌లు రేకెత్తించిన ఈ కొత్త పార్టీ పాత పంచాయ‌తీల‌తోనే( అంటే పాత స‌మ‌స్య‌ల‌తోనే) ఫైట్ చేస్తామ‌ని తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం. అదే.. సీబీఐ మాజీ జేడీ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ స్థాపించిన పార్టీ జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ.

తాజాగా వీవీ ఉవాచ ఇదే!

రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం కేంద్రం బాద్యత అని జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ చీఫ్‌ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ అన్నారు. ఏపీకీ స్పెషల్ స్టేటస్ అద్యాయం అయిపోయిందని కేంద్రంలోని వారు చెబుతున్నార‌ని, కానీ, ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ఇప్పుడే మొదలైందని చెప్పుకొచ్చారు. ``పార్లమెంట్‌లో ఏపీకి హోదా ఐదేళ్లు కావాలని అప్పటి ప్రభుత్వం చెబితే.. కాదు పదేళ్లు కావాలని బీజేపి చెప్పింది. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలు అమలు చేయలేనప్పుడు ఇక పార్లమెంట్‌కు విలువేముంటుంది`` అని లక్ష్మీనారాయ ణ అన్నారు.

ఎన్నికల కోసం మాత్రమే హోదా అంశాన్ని టీడీపీ, వైసీపీలు లేవనెత్తున్నాయని వీవీ విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా సాధన కోసం బ్యాడ్జీలు ధరించి పోరాటం చేద్దామని పిలుపిచ్చారు. పొలిటికల్ పార్టీ నేతలకు కూడా బ్యాడ్జీలు పెట్టాలన్నారు. తాను కూడా బ్యాడ్జీని తగిలిస్తానన్నారు. జనవరి 26న ప్రత్యేక హోదా కోసం ప్రతిజ్ఞ చేద్దామని సూచించారు. ప్రతి టీవీ ఛానల్ కూడా తమ లోగో పక్కన హోదా లోగోను కూడా పెట్టాలని కోరుతున్నానన్నారు.

తమిళనాడులో జల్లికట్టు కోసం ఉద్యమం చేసి సాధించారని.. అలాగే ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు కాకుండా ప్రజలు ఉద్యమిస్తేనే హోదా వస్తుందని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అయితే.. గ‌త ప‌దేళ్లుగా సాగ‌తీత‌గా ఉన్న హోదా ఉద్య‌మాలు.. చేప‌ట్ట‌డం మంచిదే అయినా.. దీనికి మించిన స‌మ‌స్య‌లు.. అనేకం ఉన్నాయ‌ని, వాటిపై పోరాడితే బెట‌రేమోన‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.