అబ్బాయిలకు కొత్త సమస్య... ఏఐ బాయ్ ఫ్రెండ్స్ ని ఇష్టపడుతున్నారంట!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎంత వైరల్ ఇష్యూ అనేది తెలిసిన విషయమే.
By: Tupaki Desk | 13 Feb 2024 11:30 PM GMTఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎంత వైరల్ ఇష్యూ అనేది తెలిసిన విషయమే. ఇప్పటికే ఈ కృత్రిమమేథ వల్ల పలు రకాల ప్రయోజనాలతోపాటు ఎన్నో రకాల ఇబ్బందులూ తలెత్తుతున్నాయనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంది. ఇందులో భాగంగా... ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కంపెనీలలో లే ఆఫ్స్ కి ఇది కూడా ఒక కారణం అనే కామెంట్లూ తెరపైకి వస్తున్నాయి.
మరొపక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఉద్యోగులకు డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. పలు రకాల ఉద్యోగాలు తీసేస్తున్నప్పటికీ.. ఇంకొన్ని రంగాల్లో ఏఐ ఆధారిక నియామకాలు పుంజుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇలా ప్లస్సు, మైనస్ ల మేళవింపుగా సాగుతున్న ఈ ఏఐతో ఇప్పుడు సరికొత్త సమస్య వచ్చిపండిందని తెలుస్తుంది. జాబ్స్ పోవడమే కాదు.. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ పోస్ట్ కి కూడా ఎసరు వస్తుందంట ఈ ఏఐ తో!
అవును... ఏఐ వల్ల ఇప్పటివరకూ ఉద్యోగాలకే ముప్పు అని అంటున్న నేపత్యంలో... మున్ముందు అబ్బాయిలకు సరికొత్త సమస్యలు రాబోతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అబ్బాయిలకు బదులుగా ఏఐ బాయ్ ఫ్రెండ్ ని ఇష్టపడుతున్నారంట చైనా అమ్మాయిలు. ప్రధానంగా అక్కడ గ్లో అనే చాట్ బోట్ యాప్ లో ఇది ఎక్కువగా నడుస్తుందని అంటున్నారు.
ఇందులో భాగంగా చైనాలో అమ్మాయులు ప్రస్తుతం ఏఐ బాయ్ ఫ్రెండ్స్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారని తెలుస్తుంది. నిజమైన పురుషులకంటే ఏఐ ప్రియుడే తమను బాగా అర్ధం చేసుకుంటున్నాడని, చెప్పినట్లు వింటున్నాడని చెప్పుకొస్తున్నారంట చైనా అమ్మాయిలు! ఈ లెక్కన చూసుకుంటే... ఈ ఏఐతో చెప్పుకోలేని సమస్యలు కూడా ముందు ముందు మరింతగా రాబోతున్నాయన్నమాట.