Begin typing your search above and press return to search.

ఇన్ కం ట్యాక్స్... కొత్త, పాత శ్లాబ్స్ లో తేడాలివే!

ఈ నేపథ్యంలో.. కొత్త, పాత శ్లాబ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎంతెంత తేడాలునాయనేది ఇప్పుడు చూద్దాం...!

By:  Tupaki Desk   |   23 July 2024 7:00 AM GMT
ఇన్  కం ట్యాక్స్...  కొత్త, పాత శ్లాబ్స్  లో తేడాలివే!
X

ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఉద్యోగులకు సంబంధించి ఇన్ కం ట్యాక్స్ విధానంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని మార్పులు చేశారు. ఇదే సమయంలో... పన్ను స్లాబుల్లో స్వల్ప మార్పులతో పాటు, సాండర్డ్ డిడక్షన్ విషయంలోనూ కాస్త ఊరటనిచ్చారు. ఈ నేపథ్యంలో.. కొత్త, పాత శ్లాబ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎంతెంత తేడాలునాయనేది ఇప్పుడు చూద్దాం...!

అవును... తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యోగులకు స్వల్ప ఊరటనిస్తూ కొత్త పన్ను విధానంలో స్వల్ప మార్పులు చేశారు. ఇందులో భాగంగా... ప్రస్తుతం ఉన్న సాండర్డ్ డిడక్షన్ రూ.50 వేలు నుంచి రూ.75 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనివల రూ.17,500 వరకూ పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్ ను ఆదాచేసుకొవచ్చని తెలిపారు.

తాజాగా బడ్జెట్ లో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం... కొత్త పన్ను విధానంలోనూ రూ.3 లక్షల వరకూ ఎలాంటి పన్నూ లేదు. ఇదే సమయంలో... గతంలో రూ.3 నుంచి 6 లక్షల స్లాబులో 5 శాతం పన్ను ఉండగా.. ఇప్పుడు ఆ పరిమితి రూ.7 లక్షలకు పెంచారు. ఇక, గతంలో 6 నుంచి 9 లక్షల శ్లాబును రూ.7 నుంచి 10 లక్షలకు మార్చారు. ఇంత ఆదాయం ఉన్నవారీ 10శాతం పన్ను వర్తించనుంది.

ఇదే సమయంలో... గతంలో రూ.9 - 12 లక్షలు వార్షిక ఆదాయం ఉన్నవారికి 15శాతం పన్ను ఉండగా... ఆ పన్ను శాతాన్ని అలాగే ఉంచుతూ ఈ పరిమితిని మాత్రం రూ.10 - 12 లక్షలకు మార్చారు. అయితే... పాత శ్లాబు విధానం లాగానే ఇప్పుడు కూడా రూ.15 లక్షలు వార్షిక ఆదాయం ఉన్నవారికి 30శాతం పన్ను విధింపులో మార్పులు లేకుండా కంటిన్యూ చేస్తున్నారు.

కొత్త శ్లాబ్ విధానం!:

సున్నా నుంచి రూ.3 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు

రూ.3 నుంచి 7 లక్షల వరకూ 5 శాతం ట్యాక్స్

రూ.7 నుంచి 10 లక్షల వరకూ 10 శాతం ట్యాక్స్

రూ. 10 నుంచి 12 లక్షల వరకూ 15 శాతం ట్యాక్స్

రూ. 12 నుంచి 15 లక్షల వరకూ 20 శాతం ట్యాక్స్

రూ. 15 లక్షల పైన 30 శాతం ట్యాక్స్ వర్తించనుంది.

పాత శ్లాబ్ విధానం!:

సున్నా నుంచి రూ.3 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు

రూ.3 నుంచి 6 లక్షల వరకూ 5 శాతం ట్యాక్స్

రూ.6 నుంచి 9 లక్షల వరకూ 10 శాతం ట్యాక్స్

రూ. 9 నుంచి 12 లక్షల వరకూ 15 శాతం ట్యాక్స్

రూ. 12 నుంచి 15 లక్షల వరకూ 20 శాతం ట్యాక్స్

రూ. 15 లక్షల పైన 30 శాతం ట్యాక్స్ వర్తించింది!