Begin typing your search above and press return to search.

జులై 1 నుంచి దేశంలో అమలు కానున్న కొత్త చట్టాలివే

ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఆన్ లైన్ లోనే పోలీసులకు ఫిర్యాదు చేసే సరికొత్త వసతిని తీసుకొస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 Jun 2024 4:19 AM GMT
జులై 1 నుంచి దేశంలో అమలు కానున్న కొత్త చట్టాలివే
X

ఫలానా అన్యాయం జరిగింది.. న్యాయం చేయాలన్నంతనే ముందు వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్ కే. అక్కడకు వెళ్లిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో వందల ఏళ్ల క్రితం తెల్లోడు రాసిన చట్టాల్నే గొప్పగా చూసుకుంటూ.. వాటిని పాటిస్తూ తరిస్తున్న దానికి భిన్నంగా కొత్త చట్టాలు ఈ జులై 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. దేశ వ్యాప్తంగా అమల్లోకి రానున్న సరికొత్త చట్టాలు దేశ ప్రజలకు సరికొత్త ఆయుధాలుగా మారతాయని చెప్పాలి. ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఆన్ లైన్ లోనే పోలీసులకు ఫిర్యాదు చేసే సరికొత్త వసతిని తీసుకొస్తున్నారు.

అంతేకాదు.. దారుణ నేరాలకు సంబంధించి.. నేరాలు జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియోను చిత్రీకరించటం లాంటి ఎన్నో కొత్త అంశాలు నిబంధనలుగా మారనున్నాయి. అంతేకాదు.. జీరో ఎఫ్ఐఆర్ తో పాటు.. వేగంగా సమస్యను తెలిపేందుకు వీలుగా కొన్ని వసతుల్ని తీసుకొస్తున్నారు. కొత్తగా తీసుకొచ్చిన ‘‘న్యూ క్రిమినల్ లా’’ తో ప్రజలకు వచ్చే వసతుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జులై 1 నుంచి దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చే న్యూ క్రిమినల్ లాకు సంబంధించిన కొన్ని అంశాల్ని చూస్తే..

- ఘటన ఏదైనా.. పోలీసులకు సమాచారాన్ని ఇవ్వాలంటే దాని కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ ద్వారా తెలిపే సౌకర్యం ఇప్పుడు రానుంది. జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా ఏ పోలీస్ స్టేషన్ లో అయినా ఫిర్యాదు చేసే వీలుంది. ఫలానా నేరానికి ఫలానా పోలీస్ స్టేషన్ కు మాత్రమే వెళ్లాలన్న నిబంధన ఇకపై ఉండదు. బాధితులతో పాటు నిందితులు కూడా ఎఫ్ఐఆర్ కాపీలను ఉచితంగా పొందే వీలుంది. వీటితో పాటు పోలీసు రిపోర్టు.. ఛార్జిషీట్.. స్టేట్ మెంట్లు.. ఇతర డాక్యుమెంట్లను 14 రోజుల్లోపు పొందొచ్చు. ఇలా చాలానే సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.