Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ నేర్చుకోవాల్సిందే !

క్రీడా మైదానాలు ప్రాధమిక పాఠశాలలు ఏర్పాటు చేసి వాటి పరిధిలోనే కొంత స్థలాన్ని ఉంచితే సరిపోతుంది. అయితే ఇక్కడ పవన్ తపనను అర్థం చేసుకోవాలి.

By:  Tupaki Desk   |   23 Aug 2024 10:35 AM GMT
పవన్ కళ్యాణ్ నేర్చుకోవాల్సిందే !
X

తాను నేర్చుకోవాల్సి ఉంది అని ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణామమే. పవన్ ఇంకా చాలా నేర్చుకోవాలి. ఆయన ఎంచుకున్న శాఖల నుంచే ఎక్కువగా నేర్చుకోవాలి. పంచాయతీ రాజ్ శాఖ అంటే మామూలు విషయం కాదు. సముద్రమంత లోతైన శాఖ. ఆ శాఖ మంత్రిగా పవన్ చేయాల్సింది చాలా ఉంది.

నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని అంటున్నారు. పవన్ బహిరంగ సభలలో మాట్లాడేటపుడు కూడా చేసే కీలక వ్యాఖ్యలలో ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే శాఖాపరంగా ఎంతో నేర్చుకోవాల్సిందే అని అంటున్నారు. పంచాయతీలకు భూములు సొంతంగా ఉండాలని పవన్ అంటున్నారు. నిజానికి గ్రామాలలో భూములు ఉన్నవి పంచాయతీలకే అని గుర్తు చేస్తున్నారు.

అంతే కాదు పంచాయతీల భూములు అని ఉంటాయి. మరి వాటి విషయంలో మంత్రిగా ఆయన స్పష్టమైన అవగాహనతో మాట్లాడాలని అంటున్నారు. పంచాయతీ భూములను కబ్జా చేసే సహించేది లేదు అని అంటున్నారు. గూండా యాక్ట్ ని తీసుకుని వస్తామని చెబుతున్నారు. ఇది బాగానే ఉంది. భూముల కబ్జా ను అరికట్టడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే ఎవరైనా ఆహ్వానించి తీరుతారు.

అదే సమయంలో గ్రామాల్లో కాలేజీలు లేవు అని పవన్ అంటున్నారు. నిజానికి గ్రామాలలో పాఠశాలలు కూడా లేని దుస్థితి ఉంది. మండలాలకే కాలేజీలు లేవు అన్న సంగతి కూడా ఉంది. అయినా గ్రామాలకు కాలేజీలు అవసరం లేదు ప్రాధమిక పాఠశాలలు ఉంటే చాలు ఆ మీదట కాలేజీ చదువులకు మండల స్థాయిలో వాటిని ఏర్పాటు చేస్తే మేలు అని అంటున్నారు.

క్రీడా మైదానాలు ప్రాధమిక పాఠశాలలు ఏర్పాటు చేసి వాటి పరిధిలోనే కొంత స్థలాన్ని ఉంచితే సరిపోతుంది. అయితే ఇక్కడ పవన్ తపనను అర్థం చేసుకోవాలి. కానీ ఏపీలో చూస్తే 13 వేల చిల్ల్లర గ్రామాలు ఉన్నాయి. మరి ప్రతీ గ్రామానికి ఒక కాలేజీని ఎవరైనా పెట్టగలరా. పెట్టినా చదువుకునే వారు ఎందరు ఉంటారు అన్న ప్రశ్నలు ఉన్నాయి.

అయినా పవన్ కి గ్రామాలు బాగుండాలన్న ఆలోచన ఉండడం భేష్ అని అంటున్నారు. గ్రామాలకు కావాల్సింది తాగు నీరు కనీస మౌలిక సదుపాయాలు. అలాగే స్థానిక స్వపరిపాలన. ఈ విషయంలో కనుక పంచాయతీ రాజ్ శాఖ చేయాల్సింది చేస్తే పవన్ ఆ శాఖ మంత్రిగా గుర్తుండిపోతారు అని అంటున్నారు.

ఇక పంచాయతీలలో పారిశుద్ధ్యం సమస్యలు ఉన్నాయి. పేరుకు పల్లెలు కానీ అక్కడ బొత్తిగా సౌకర్యాల లేమి ఉంది. పంచాయతీలకు నిధులు విధులు ఇస్తే కచ్చితంగా అవి బాగుపడతాయి. అది కూడా సర్పంచులు కానీ ఇతర ప్రజా ప్రతినిధులు కానీ అవినీతి లేకుండా చూస్తేనే అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ ఆ శాఖలో ఇంకా ఇపుడిపుడే కుదురుకుంటున్నారు. దాంతో ఆయన మరింతగా రాటు తేలాల్సి ఉంది అని అంటున్నారు. పంచాయతీలు పట్టుగొమ్మలను ప్రతీ ప్రభుత్వం చెబుతుంది. కానీ ఆ పంచాయతీలకు ఇచ్చే నిధులను వేరే రూట్ లో తెచ్చుకుని వాడుకుంటుంది. ఇది జగన్ సర్కార్ లోనే కాదు గత ప్రభుత్వాలలోనూ ఉంది. దేశంలోనూ ఉంది.

అందుకే పంచాయతీలు అభివృద్ధి లేమితో ఉంటున్నాయి. నిధులను కేంద్రం నుంచి నేరుగా పల్లెలకు వచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరింతగా నిధులు కేటాయిస్తే పల్లెలు స్వర్గసీమలుగా మారుతాయి. టీడీపీ కూటమిలో ముఖ్య భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ విషయం ఆలోచిస్తే బాగుంటుంది అని అంటున్నారు.మొత్తానికి పవన్ ఆ శాఖ మంత్రిగా అతి ఉత్సాహంలో చాలానే మాట్లాడుతున్నారు. దాంతో ఆయన నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అన్న చర్చ అయితే మొదలైంది.