Begin typing your search above and press return to search.

ఫుడ్ ప్యాకేజీకి న్యూస్ పేపర్లు వాడుతున్నారా? అదెంతో డేంజర్!

అయితే.. ఇలా చేయటం ఎంత ప్రమాదకరమన్న విషయాన్ని తాజాగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక సూచన చేసింది

By:  Tupaki Desk   |   29 Sep 2023 1:30 PM GMT
ఫుడ్ ప్యాకేజీకి న్యూస్ పేపర్లు వాడుతున్నారా? అదెంతో డేంజర్!
X

ఏళ్లుకు ఏళ్లుగా ఉండే అలవాటు ఒక్కసారిగా మార్చుకోమంటే చాలామంది మార్చుకోరు. కానీ.. అదెంత ప్రమాదకరమన్న విషయం తాజాగా బయటకు వచ్చినప్పుడు మాత్రం.. ఇంతకాలం ఇంత రిస్కు చేస్తున్నామా? అన్న భావన కలుగక మానదు. టిఫెన్ మొదలు కొని చిరుతిండ్లు వరకు.. న్యూస్ పేపర్ తో తీసుకోవటం.. వాటితో ప్యాకింగ్ చేసుకోవటం తెలిసిందే. మరి ముఖ్యంగా బజ్జీలు.. పునుగులు.. సమోసాల్ని న్యూస్ పేపర్ తో చుట్టి ఇవ్వటం చాలా చోట్ల చూస్తున్నదే.

అయితే.. ఇలా చేయటం ఎంత ప్రమాదకరమన్న విషయాన్ని తాజాగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక సూచన చేసింది. ఆరోగ్యానికి హాని కలిగించే ఈ రిస్కును అస్సలే చేయొద్దని చెప్పింది. ఫుడ్ పార్సిల్స్ ను న్యూస్ పేపర్లలో ఇవ్వటాన్ని అడ్డుకోవటానికి రాష్ట్రాలతో కలిసి పని చేయాలని నిర్ణయించింది. అయితే.. ఇదెంత ప్రమాదకరమన్న విషయాన్ని తెలియజేస్తూ.. కీలక అంశాల్ని వెల్లడించింది.

న్యూస్ పేపర్లను తినే ఆహారపదార్థాల ప్యాకేజీకి వాడటం ద్వారా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది. కారణంగా న్యూస్ పేపర్ల ప్రింటింగ్ కోసం వినియోగించే ఇంక్ లో బయోయాక్టివ్ మెటీరియల్స్ కలిగి ఉంటాయని.. ఇవి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. అంతేకాదు.. న్యూస్ పేపర్లతో ప్యాక్ చేసిన ఫుడ్.. ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని హెచ్చరించింది. ఆహారాన్ని కలుషితం చేయటంతో పాటు.. ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని పేర్కొన్నారు. ప్రింటింగ్ ఇంక్ లో సీసం.. భారీ లోహాలతో పాటు పలు రసాయనాల మిశ్రమం అన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. న్యూస్ పేపర్ ప్యాకింగ్ ద్వారా ఇవి ఆహారంలోకి చేరి సమస్యలను తెచ్చి పెడతాయని పేర్కొన్నారు. సో.. పుడ్ ప్యాకింగ్ కు న్యూస్ పేపర్లు వాడేవారంతా జర జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.