Begin typing your search above and press return to search.

మహిళల కోపం తగ్గడానికి చిట్కా... ఏమిటీ 'రేజ్‌ రిచ్యువల్‌'?

ఇందులో భాగంగా... "రేజ్‌ రిచ్యువల్‌" అనే పరిష్కారాన్ని కనిపెట్టింది మియా బంధూకీ అనే అమెరికన్‌ ఇన్‌ ఫ్లుయెన్సర్‌!

By:  Tupaki Desk   |   1 Jun 2024 4:36 AM GMT
మహిళల కోపం తగ్గడానికి చిట్కా... ఏమిటీ రేజ్‌  రిచ్యువల్‌?
X

దేశం ఏదైనా, ప్రాంతం మరేదైనా ఆడపిల్లలకే ఎక్కడ లేని రూల్స్ ఉంటాయని చెబుతుంటారు. గట్టిగా మాట్లాడకూడదు, కోపాన్ని చూపించకూడదు, ఎక్కువగా ఏడవకూడదు.. ఇలాంటి ముతక నియమాలు ఈ సమాజంలో ఎక్కువగానే ఉన్నాయి! ఈ విషయంలో ఆ దేశం ఈ ప్రాంతం అనే తారతమ్యాలేమీ లేవనే చెప్పాలి! వీటికోసమే తెరపైకి వచ్చింది "రెజ్ రిచ్యువల్"!

అవును... ఈ సమాజంలో ఆడపిల్లలకు బోలెడన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయనేది తెలిసిన విషయమే. వారు చేసే దాదాపు మెజారిటీ పనులకు చాలానే నియమ నిబంధనలు పెడుతుంటారు! దీంతో... రాను రానూ ఆడపిల్లలకు ఈ రూల్స్ వల్ల మరింత కోపం, ఒత్తిడి పెరిగిపోతున్నాయి. కొందరు ఇవన్నీ గుర్తించుకుని యోగ, ధ్యానంపై దృష్టిపెడుతుంటారు.

ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ స్ట్రెస్ పోగొట్టుకోవడానికి ఆల్టర్నేటివ్ చూసుకుంటుంటారు. మరికొంతమంది మౌనంగా ఆ భారాన్ని మోస్తుంటారు. ఈ క్రమంలో ఈ తరహా సమస్యకు తాజాగా ఒక పరిష్కారం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... "రేజ్‌ రిచ్యువల్‌" అనే పరిష్కారాన్ని కనిపెట్టింది మియా బంధూకీ అనే అమెరికన్‌ ఇన్‌ ఫ్లుయెన్సర్‌!

దీనిప్రకారం... కొంతమంది మహిళలు బృందంగా ఏర్పడి, ఓ అటవీ ప్రాంతాన్ని ఎంచుకుని, వీలైనంతవరకూ వీకెండ్స్ సమయాల్లో అక్కడికి వెళతారు! ఈ సమయంలో తమ మనసులోని భారమంతా దిగేలా, ఒత్తిడంతా పోయేలా గట్టిగా అరుస్తారు. ఈ క్రమంలోనే అక్కడున్న వస్తువులను విరగ్గొడతారు. దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎండిన కర్రలను వాడతారు.

ఇలా చాలా సేపు చేసిన తర్వాత.. పూర్తిగా కోపమంతా దిగింది అనే భావన వచ్చిన తర్వాత కాస్త రిలాక్స్ అవుతారు. ఇలా చేయడం వల్ల లోలోపల దాగున్న కోపమంతా బయటికొచ్చి ప్రశాంతంగా ఉన్నట్లు భావిస్తున్నవారి సంఖ్య ఇటీవల బాగా పెరిగిందంట. దీంతో ఈ రెజ్ రిచ్యువల్ కు ప్రాధాన్యం పెరుగుతోందని అంటున్నారు.

దీనికోసం ఒక్కరోజు, రెండురోజుల ప్యాకేజీలు ఉంటాయి. వీటి టారిఫ్ రూ.3 లక్షల నుంచి 6 లక్షల వరకూ ఉంటుందని చెబుతున్నారు. ఇంట్లో వేరేవాళ్లకి అసౌకర్యం కలగకుండా.. వస్తువులూ పాడవకుండా.. పోలీసు కేసుల ఊసే లేకుండా.. ఇలా ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్లి మనసును కూల్ చేసుకోవడం కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టడానికి పలువురు మహిళలు ఏమాత్రం వెనకాడటం లేదంట!

దీంతో... శతకోటి సమస్యలకు అనంత కోటి ఉపాయాలంటే ఇదేనేమో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు!