Begin typing your search above and press return to search.

న్యూ ఇయర్ రోజు ఏమి జరిగింది... గంటకు 1722 యూనిట్ల కండోమ్స్‌!

2023 ఏడాది కాలగర్భంలో కలిసి పోయింది.. నూతన సంవత్సరం 2024కి ప్రపంచమంతా గ్రాండ్ గా వెల్ కం చెప్పింది

By:  Tupaki Desk   |   2 Jan 2024 7:33 AM GMT
న్యూ ఇయర్ రోజు ఏమి జరిగింది... గంటకు 1722 యూనిట్ల కండోమ్స్‌!
X

2023 ఏడాది కాలగర్భంలో కలిసి పోయింది.. నూతన సంవత్సరం 2024కి ప్రపంచమంతా గ్రాండ్ గా వెల్ కం చెప్పింది. ఈ సమయంలో పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ మిన్నంటాయి. ఇక ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయని తెలుస్తుంది! మందుబాబులు దుమ్ములేపేశారని అంటున్నారు. ఈ సందర్భంగా న్యూ ఇయర్ వేళ ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టిన కండోమ్స్‌ రికార్డ్ నెలకొల్పాయని తెలుస్తుంది.

అవును... కొత్త ఏడాదికి గ్రాండ్ గా వెల్ కం పలికే సమయంలో రికార్డ్ స్థాయిలో నమోదైన ఆర్డర్స్ వివరాలను ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ తెలిపింది. ఇందులో భాగంగా... న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ ఒక్క హైదరాబాద్‌ లోనే ఏకంగా 4.8 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ వెల్లడించింది. 2023 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సమయంలో వచ్చిన ఆర్డర్ల కంటే ఈ ఆర్డర్లు సుమారు 1.6 రెట్లు ఎక్కువ అని తెలిపింది.

అంటే సరాసరిన హైదరాబాద్‌ న్యూ ఇయర్ వెల్ కం వేడుకల వేళ ప్రతీ నిమిషానికి సుమారు 1244 ఆర్డర్లు వచ్చాయని.. ఇదే సమయంలో, చివరి గంటలో సుమారుగా 10 లక్షల మంది స్విగ్గీ యాప్‌ ను ఉపయోగించినట్లు కంపెనీ పేర్కొంది. ఇదే సమయంలో ఫుడ్ ఆర్డర్స్ మాత్రమే కాకుండా... ఓయో రూమ్ బుకింగ్స్‌ కూడా రికార్డ్‌ స్థాయిలో జరిగాయని తెలుస్తుంది.

ఇందులో భాగంగా డిసెంబర్‌ 30, 31 తేదీల్లోనే ఏకంగా 2.3 లక్షల ఓయో రూమ్స్‌ బుక్‌ అయ్యాయని అంటున్నారు. అంటే... గతేడాదితో పోల్చితే ఈ ఏడాది రూం బుకింగ్స్ 37 శాతం పెరిగాయని చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే... న్యూ ఇయర్‌ వేడుకల సమయంలో ప్రతి గంటకు 1,722 యూనిట్ల కండోమ్స్‌ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్‌ తెలిపింది. దీంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ "భారీ"ఎత్తునే జరిగినట్లున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!