సోరెన్ తరువాత ఆ ముఖ్యమంత్రి అరెస్ట్ అవుతారా...!?
ఆయన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని అంటున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కాం లో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ అయి చాలా కాలం అయింది.
By: Tupaki Desk | 2 Feb 2024 3:37 AM GMTముఖ్యమంత్రుల స్థాయి వారు అరెస్ట్ కావడం అంటే చిన్న విషయం కాదు. ఒకప్పుడు ఎమ్మెల్యేలు అరెస్ట్ అంటేనే అది పెద్ద వింతగా ఉండేది. కానీ ఇపుడు రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రులను సైతం ఏమీ కాకుండా అరెస్ట్ చేసి పారేస్తున్నారు. ఈడీలు సీబీఐలు వెంటపడుతున్నాయి. అవినీతి మీద పోరాటం అని కేంద్రంలోని బీజేపీ చెబుతోంది. ఇది రాజకీయ కక్ష సాధింపు అని విపక్షాలు అంటున్నాయి.
ఎవరు ఏమి అన్నా కూడా సీఎం ల అరెస్ట్ అన్నది విపక్ష శిబిరంలోని వారిలో గుబులు రేపుతోంది. ఈ రోజు ఆయన రేపు ఎవరు అన్న కొత్త చర్చకు దారితీస్తోంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ని అరెస్ట్ చేస్తారు అని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇపుడు ఎన్నికల ముంగిట అరెస్ట్ అని ఎవరూ అసలు ఊహించలేదు. కానీ జరిగిపోయింది. ఆయన మాజీ సీఎం గా అరెస్ట్ అయినా అరెస్ట్ కత్తి వేలాడుతోంది కాబట్టి సీఎం పదవికి రాజీనామా చేశారు అన్నది నిజం అంటున్నారు.
కొన్ని రోజుల పాటు కనిపించకుండా అజ్ఞాత వాసం చేసినా కూడా అరెస్ట్ నుంచి హేమంత్ సోరెన్ తప్పించుకోలేకపోయారు. ఆయన అరెస్ట్ అయ్యారు. ఇపుడు ఎవరు వంతు అన్నది కూడా జాతీయ రాజకీయాలలో చర్చ సాగుతోంది. అయితే సోరెన్ తరువాత ఎవరు అన్నది మాత్రం చాలా వరకూ ఊహించేస్తున్నారు.
ఆయన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని అంటున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కాం లో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ అయి చాలా కాలం అయింది. ఇపుడు అరవింద్ కేజ్రీవాల్ అని అంటున్నారు. ఆయన్ని ఈడీ విచారణకు పలుసార్లు పిలిచారు. ఆయన కొన్ని సార్లు వెళ్లారు, కొన్ని సార్లు వెళ్ళలేదు. బీజేపీ మీద దుమ్మెత్తిపోతున్నారు అరవింద్ కేజ్రీవాల్
అయినా కూడా ఆయన అరెస్ట్ ఆగేది కాదని అంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అని అరెస్ట్ చేస్తే పరిణామాలు ఏమిటో కూడా తెలుసు అంటున్నారు. అయినా ఆయన్ని అరెస్ట్ చేయడానికి ముహూర్తం చూస్తున్నారు అని అంటున్నారు. బీజేపీ మోడీ నాయకత్వంలో రెండవసారి అధికారంలోకి వచ్చాక సోనియాను రాహుల్ ని సైతం విచారణకు రప్పించారు.
చాలా మంది మీద కేసులు పడ్డాయి. ఇపుడు వరసగా అరెస్టులు జరుగుతున్నాయి. బీజేపీని నిందించినా ప్రయోజనంలేదు అని అంటున్న వారూ ఉన్నారు. చట్టం తన పని తాను చేసుకునిపోతుందని చెబుతున్న వారూ ఉన్నారు. ఎవరమనుకున్నా బీజేపీ మాత్రం అవినీతి చేసిన వారికి అరెస్టులే దారి అంటోంది. ఈ రోజు సోరెన్, రేపు కేజ్రీవాల్ ఎల్లుండి ఎవరు అన్నది మాత్రం ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది.