Begin typing your search above and press return to search.

వచ్చే ఎన్నికలు వైసీపీకి సవాల్... సీనియర్ మంత్రి సంచలన కామెంట్స్...!

తెలుగుదేశం పార్టీ అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇరవై మూడు ఏపీకి మంజూరు అయితే మచ్చుకు అయినా ఒక్క సంస్థని కూడా శ్రీకాకుళానికి ఇవ్వలేదని అన్నారు.

By:  Tupaki Desk   |   27 Oct 2023 3:53 AM GMT
వచ్చే ఎన్నికలు వైసీపీకి సవాల్... సీనియర్ మంత్రి సంచలన కామెంట్స్...!
X

ఎన్నికలు అంటేనే సవాల్. జవాబు చెప్పేది ప్రజలు. రాజకీయ పార్టీల సందేహాలకు సమాధానాలు ప్రజలు ఓటు అనే తీర్పు ద్వారా ఇస్తారు. ఇదిలా ఉంటే వై నాట్ 175 అంటూ వైసీపీ అధినాయకత్వం నిబ్బరంగా ఉంది ఈసారి మనం కాక ఎవరు గెలుస్తారు అని కడు నమ్మకంగా ఉంది. కానీ అదే పార్టీకి చెందిన సీనియర్ నేతలు, మంత్రులు మాత్రం ఒక సవాల్, ఆషా మాషీ కాదు అని అంటున్నారు.

అది ముందు జాగ్రత్త లేక అలెర్ట్ కావాలని క్యాడర్ కి ఇచ్చిన సందేశమా లేక నిజంగా అలాగే సీన్ ఉంటుందని చెప్పడమా అన్న ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఇదిలా ఉంటే కొద్ది నెలల క్రితం ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసారి ఎన్నికలు మామూలుగా ఉండవని పార్టీ మీటింగులో అన్నారు.

సీన్ కట్ చేస్తే ఇపుడు శ్రీకాకుళం సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు వంతు. ఆయన వైసీపీ సామాజిక బస్సు యాత్రలో భాగంగా ఇచ్చాపురంలో మాట్లాడుతూ ఈసారి ఎన్నికలు వైసీపీకి సవాల్ అని మనసులో మాట చెప్పేశారు. మరి ధర్మాన ధర్మంగా మాట్లాడుతారు అని పేరుంది. అలాంటి పెద్దాయన అలా అంటున్నారు అంటే నిజంగా వైసీపీకి హోరా హోరీ పోరు తప్పదా అన్నదే చర్చగా ఉంది.

వార్ వన్ సైడ్ అని వైసీపీలో ఒక వైపు వినిపిస్తూంటే అలా కాదు సవాల్ అని గట్టిగా సీనియర్ మంత్రి అంటున్నారు. ఎన్నో ఎన్నికలను చూసిన యోధుడు ఆయన. అలాంటి ధర్మాన అన్నారూ అంటే ఎంతో కొంత వాస్తవం ఉంటుంది అని అంటున్న వారూ లేకపోలేదు. అయితే ధర్మాన అంటున్నది ఏంటి ఏంటే ఈసారి కూడా వైసీపీ ప్రభుత్వాన్ని తీసుకోవాలని అంటున్నారు.

వైసీపీ ఉత్తరాంధ్రాకు చేసిన మేలు మరే పార్టీ చేయలేదని ఆయన అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇరవై మూడు ఏపీకి మంజూరు అయితే మచ్చుకు అయినా ఒక్క సంస్థని కూడా శ్రీకాకుళానికి ఇవ్వలేదని అన్నారు. అలాంటి పార్టీకి ఓటేయాలా అని నిలదీశారు చంద్రబాబుకు శ్రీకాకుళంలో ఓటు అడిగే హక్కు ఎక్కడ ఉంది అని కూడా ధర్మాన అన్నారు.

వైసీపీ జిల్లాను ఎంతో అభివృద్ధి చేసింది, సామాజిక న్యాయం ఏంటో చూపించింది, కాబట్టి మరోసారి వైసీపీకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. క్యాడర్ సైతం అసంతృప్తికి లోను కాకుండా పార్టీ కోసం పనిచేయాలి. ఈసారి గెలిస్తే మరిన్ని పదవులు వస్తాయని ఆయన అంటున్నారు

మొత్తానికి చూస్తే పార్టీకి ఈసారి ఎన్నికలు సవాల్ అని చెప్పిన ధర్మాన కష్టపడి పనిచేయాలని కోరారని అంటున్నారు. అన్నీ తమ చేతుల మీదుగా జరగాలని క్యాడర్ అనుకోరాదు అని ధర్మాన చేస్తున్న హితబోధలు చూస్తూంటే వైసీపీకి ఎన్నికలు ఒక సవాల్ గానే ఉంటాయని అనిపించకమానదు.