జంక్ ఫుడ్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఈ నేపథ్యంలో పిల్లల ఫుడ్ కి సంబంధించిన ప్రకటనల విషయంలో తాజాగా బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Desk | 5 Dec 2024 10:30 PM GMTఇటీవల 16ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా వాడకం విషయంలో ఆస్ట్రేలియా సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పిల్లల ఫుడ్ కి సంబంధించిన ప్రకటనల విషయంలో తాజాగా బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అవును... పిల్లలు తినే ఫుడ్ కి సంబంధించిన ప్రకటనల విషయంలో బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... టీవీలో వచ్చే జంక్ ఫుడ్ కు సంబంధించిన ప్రకటనలు (యాడ్స్) పగటి వేల ప్రసారం చేయడంపై నిషేధం విధించింది. ఈ తాజా ఆంక్షలు వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపింది.
సాధారణంగా ఆకర్షణీయంగా కనిపించే (జంక్) ఫుడ్ విషయంలో పిల్లలు అతిగా మారాం చేస్తారనే సంగతి తెలిసిందే. వారు అడిగింది కొనిచ్చేవరకూ వాళ్లు నార్మల్ మూడ్ లోకి రారు. ఇలా జంక్ ఫుడ్ ఎక్కువ మోతాదులో తీసుకునే పిల్లలు ఊబకాయానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పైగా... బ్రిటన్ లో చిన్నారులు ఇటీవల ఎక్కువగా ఊబకాయంతో బాధపడుతునట్లు నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్.హెచ్.ఎస్.) నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ప్రతీ 10 మంది చిన్నారుల్లో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. దీనికి తోడు దంతక్షయం సమస్యలు కూడా పెరుగుతున్నాయని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే బ్రిటన్ ప్రభుత్వ ఈ ఆలోచన చేసింది. ఇందులో భాగంగా.. అధిక చక్కెరలు, ఫ్యాట్ అధిక మోతాదులో ఉన్న పదార్ధాలతో పాటు కూల్ డ్రింక్స్ కు సంబంధించిన యాడ్స్ పగటి పూట ప్రసారం చేయడంపై నిషేదం విధించింది. ఈ సందర్భంగా... ఏటా సుమారు 20 వేల ఊబకాయం కేసులను నిరోధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.