శత్రు దేశ అధ్యక్షుడి అరెస్టుకు రూ.215 కోట్ల బైడెన్ ఆఫర్
ఆ తర్వాత నికొలస్ మదురో అధికారంలోకి వచ్చారు. చావెజ్ పార్టీకే (యునైటెడ్ సోషలిస్ట్) చెందిన ఈయన 12 ఏళ్లుగా వెనెజువెలా అధ్యక్షుడిగా ఉన్నారు.
By: Tupaki Desk | 11 Jan 2025 8:30 PM GMTవెనెజువెలా.. దక్షిణ అమెరికా ఖండంలోని కీలక దేశం.. చమురు నిల్వలు భారీగా ఉన్న దేశం.. ఒకప్పుడు వెనుజువెలా గొప్ప ఆర్థిక వ్యవస్థతో ఉండేది. మరీ ముఖ్యంగా ఆ దేశ అధ్యక్షుడిగా హ్యూగో చావెజ్ ఉండగా అమెరికాకు కంట్లో నలుసుగా మారారు. అమెరికా పెత్తనాన్ని ఏమాత్రం సహించని చావెజ్.. వెనెజువెలా ప్రయోజనాలే లక్ష్యంగా వ్యవహరించేవారు. అయితే, చావెజ్ 2012లో చనిపోయారు. ఆ తర్వాత నికొలస్ మదురో అధికారంలోకి వచ్చారు. చావెజ్ పార్టీకే (యునైటెడ్ సోషలిస్ట్) చెందిన ఈయన 12 ఏళ్లుగా వెనెజువెలా అధ్యక్షుడిగా ఉన్నారు.
మూడోసారీ ఆయనే..
చావెజ్ 2012లో చనిపోయాక 2013లో మదురో అధ్యక్షుడు అయ్యారు. 2013, 2018, 2024లోనూ గెలిచారు. తాజాగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. కాగా, గత ఏడాది జూలైలో జరిగిన ఎన్నికల్లో మదురో ఓడిపోయారనేందుకు స్పష్టమైన ఆధారాలు దొరికాయనే కథనాలు వస్తున్నాయి. దీంతో మదురోను అరెస్టు చేసేందుకు తగిన అధారాలు అందించినవారికి ఇవ్వనున్న బహుమతి మొత్తాన్ని 25 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.215 కోట్లు పెంచినట్లు బైడెన్ పరిపాలనా విభాగం ప్రకటించింది).
అధ్యక్షుడిగా గుర్తించకుండా
పొరుగు ఖండమైన దక్షిణ అమెరికాలో కీలక దేశం వెనెజులాకు
అధ్యక్షుడిగా మదురోను అమెరికా గుర్తించలేదు. ఎన్నికల్లో తాను గెలిచినట్లు మదురో ఆధారాలను సమర్పించలేదు. ప్రత్యర్థి ఎడ్ముండో గొంజాలెజ్ మాత్రం దొరికిన ఓట్ల లెక్కింపు ఆధారాలను సమర్పించారు. వీటిప్రకారం గొంజాలెంజ్ కే అత్యధిక ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. ఈయనే అధ్యక్షుడు అని అమెరికా ప్రకటించింది. మదురోను పదవి నుంచి తప్పుకోవాలని కోరింది.
కాగా తాత్కాలిక రక్షిత హోదాతో అమెరికాలో నివసిస్తున్న దాదాపు 6 లక్షల మంది వెనెజువెలా వాసులకు మరింత రక్షణ కల్పిస్తున్నట్లు బైడెన్ ప్రభుత్వం తెలిపింది. వీరు మరో 18 నెలలు అమెరికాలో ఉండొచ్చు.
మదురో అరెస్టుకు ఆధారాలు ఇచ్చినవారికి బహుమతిని పెంచే నిర్ణయం వెనుక వెనెజువెలా ప్రజలకు సంఘీభావం తెలపడమే అమెరికా ఉద్దేశం. 2020లో మదురోపై అమెరికాలో కేసులు నమోదయ్యాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న నార్కో-టెర్రరిజం, అంతర్జాతీయ కొకైన్ అక్రమ రవాణా కుట్రలో మదురో నిందితుడు. మదురో తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాలకే, అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ 8 మంది వెనెజువెలా అధికారులపై పలు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.