అద్దె ఇల్లే బెటర్ అన్నాడు.. సొంతిల్లు కొనేశాడు.. కారణం ఇదేనట
తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించాడో ప్రముఖుడు. జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ గురించి తెలిసిందే.
By: Tupaki Desk | 20 Oct 2024 12:30 PM GMTచెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం సంబంధం లేకుండా వ్యవహరించే ప్రముఖులు కొందరు ఉంటారు. పేరు ప్రఖ్యాతులున్న కొందరు ప్రముఖులు.. కొన్ని సిద్దాంతాల్ని వల్లెవేస్తే.. తమకు తోచిన లాజిక్కులు వినిపిస్తూ.. మాటలు చెబుతుంటారు. కాలక్రమంలో గతంలో తాము చెప్పిన మాటలు..వినిపించే సిద్దాంతాలకు భిన్నంగా వారి చేతలు ఉంటాయి. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించాడో ప్రముఖుడు. జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ గురించి తెలిసిందే. ఎప్పుడు.. ఎలాంటి చర్చలోనైనా సరే.. అద్దె ఇల్లు బెస్టు అంటూ.. సొంతిల్లు కొనుగోలు చేయటంతో వచ్చే చిక్కులు.. చికాకుల గురించి తరచూ చెబుతుంటారు. ఆర్థికంగా కూడా ఎంత నష్టదాయమన్న విషయాన్ని వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు.
అయితే.. ఇలా మాట్లాడే వారిలో చాలామంది సొంతిల్లు ఉన్నోళ్లే కనిపిస్తారు. ఇప్పుడు జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ కూడా సొంతిల్లు ఉన్న వారి క్లబ్ లోకి వచ్చేశాడు. ఇటీవల ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఆయన.. అద్దె ఇంటి కంటే కూడా సొంతిల్లే చాలా బెటర్ అంటూ తాజాగా తన సిద్ధాంతాన్ని మార్చి చెప్పుకొచ్చాడు. ప్రెస్టీజ్ గ్రూప్ ఛైర్మన్ కం ఎండీ ఇర్ఫాన్ రజాక్.. బ్రిగేడ్ గ్రూప్ వ్యవస్థాపకురాలు నిరూపా శంకర్.. వుయ్ వర్క్ ఇండియా సీఈవో కిరణ్ విర్వానీలతో కామత్ ఇటీవల పాడ్ కాస్ట్ ను నిర్వహించారు.
ఈ సందర్భంగా సొంతిల్లు.. అద్దె ఇంటికి సంబంధించి తన మారిన అభిప్రాయాన్ని అందంగా చెప్పటం కనిపించింది. ‘8అద్దె ఇల్లు ఉంటే ఒక ప్రతికూలత ఉంటుంది. అద్దె ఇల్లు ఉంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే.. ఒక ప్రతికూలత ఉంది. అద్దె ఇంటిని ఎప్పుడు ఖాళీ చేయాల్సి వస్తోందని ముందుగా అంచనా వేయలేం.సుదీర్ఘ కాలం పాటు ఒక ఇంట్లో ఉండాలని అనుకున్నా.. ఇప్పుడు ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో తాజాగా ఇంటిని కొనుగోలు చేశా’’ అంటూతన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.
ఇల్లు కొనడంతో ఆర్థిక బలం పెరుగుతుందన్న అంశంపై కామత్ మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ అన్నది ఇల్లిక్విడ్. ఈ తీరు నాకు నచ్చింది. బంగారంపై ఆసక్తి ఉందని.. రియల్ ఎస్టేట్ ఇల్లిక్విడ్ నాకు నచ్చదన్న ఆయన ఇందులో పెట్టుబడులు తొందరగా మాయమవుతుంటాయి. సరైన కొనుగోలుదారుని వద్ద సరైన ధరకు కొంటేనే ఫలితం ఉంటుంది. ఇదంతా ఒక రాత్రిలో జరిగే పని కాదన్న ఆయన.. ‘‘వీటి కొనుగోళ్లు.. చెల్లింపులు చాలా కష్టం. అదే నావద్ద కొన్ని స్టాక్స్ ఉన్నాయనుకుంటే స్టాక్ బ్రోకర్ సాయంతో వాటిని అమ్మేస్తాను. మూడు రోజుల్లో డబ్బలు చేతికి వచ్చాయి. రియల్ ఎస్టేట్ లో అలా కుదరదు’’ అని పేర్కొన్నారు. మొత్తంగా మొన్నటి వరకు అద్దె ఇళ్లకు బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా వ్యవహరించిన కామత్ ఇప్పుడు సొంతిల్లు కొనుగోలు చేయటం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.