తొమ్మిదో క్లాస్ బాలిక.. మగబిడ్డకు తల్లైంది.. ట్విస్టు ఏమంటే?
చదువుతున్నది తొమ్మిదో తరగతైనప్పుడు వయసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By: Tupaki Desk | 12 Jan 2024 4:12 AM GMTచదువుతున్నది తొమ్మిదో తరగతైనప్పుడు వయసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి బాలికతాజాగా తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బందిపడుతుంటే.. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. ఆ బాలిక గర్భవతి అని.. ఆమె కడుపునొప్పి పురిటినొప్పులుగా తేల్చటమే కాదు.. పండంటి మగబిడ్డకు తల్లైంది. చిన్న వయసులో డెలివరీ అయినప్పటికీ తల్లీ.. బిడ్డా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కర్ణాటకలో కలకలాన్ని రేపుతున్న ఈ ఉదంతంలో షాకింగ్ ట్విస్టులు బోలెడు.
తమకూరు జిల్లాలోని ఒక ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో తొమ్మిదో క్లాస్ చదువుతున్న బాలిక తాజాగా డెలివరీ అయిన ఉదంతం విద్యాశాఖలో కలకలాన్ని రేపింది. ఇటీవల హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లిన విద్యార్థినికి తీవ్రమైన కడుపునొప్పి రావటంతో ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లటం.. ఆమెకు తొమ్మిదో నెల అని చెబుతూ డెలివరీ చేవారు. బాలిక బరువు తక్కువగా ఉన్నప్పటికీ ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా చెబుతున్నారు
వైద్యుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులకు ఈ ఉదంతంలో షాకుల మీద షాకులు తగులుతున్నాయి. దీనికి కారణం.. ఆ బాలిక ఇస్తున్న పొంతన లేని సమాధానాలే. బాలికను బాలల సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇప్పించగా.. స్కూల్లో చదువుతున్న సీనియర్ విద్యార్థే ఆమె గర్భానికి కారణంగా భావించారు. అయితే.. సదరు విద్యార్థి తనకు సంబంధం లేదని చెప్పటం.. అదే టైంలో సదరు బాలిక.. స్కూల్లో మరో స్టూడెంట్ పేరు చెప్పటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. దీంతో.. బాలికను విచారించటంతో పాటు.. ఆమె చెబుతున్న వారందరిని గుర్తించి.. మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని.. నిందితుడ్ని గుర్తిస్తామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు సీరియస్ గా స్పందించి.. బాలిక చదువుతున్న హాస్టల్ వార్డెడ్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.