పని మొదలుపెట్టిన కొత్త సీఎస్... కీలక ఆదేశాలివే!
ఇదే క్రమంలో... వివిధ రాష్ట్రాల సీఎం లు కూడా రాబోతున్న వేళ ప్రోటోకాల్ విషయాలపై ప్రత్యక బృందాలను నియమించినట్లు తెలిపారు.
By: Tupaki Desk | 9 Jun 2024 6:52 AM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బాధ్యతలు స్వీకరించిన ఆయన చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు.. చీఫ్ సెక్రటరీగా తన తొలి బాధ్యతలను వెల్లడించారు. ఇదే సమయంలో ఆర్థిక శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
అవును... ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న వేళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నీరభ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజనరీ లీడర్ గా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద చీఫ్ సెక్రటరీ గా పనిచేసే అవకాశం రావడం పట్ల తాను ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇక, చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి బాధ్యతగా... ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం.. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాబోతున్న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను పర్యవేక్షించే పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోని భద్రతా పరంగా తీసుకొవాల్సిన జాగ్రత్తలపై డీజీపీతో చర్చించి తగు సూచనలు చేసినట్లు వెల్లడించారు.
ఇదే క్రమంలో... వివిధ రాష్ట్రాల సీఎం లు కూడా రాబోతున్న వేళ ప్రోటోకాల్ విషయాలపై ప్రత్యక బృందాలను నియమించినట్లు తెలిపారు. వాటితో పాటు సచివాలయంలో ఉన్నతాధికారులతో కీలకమైన ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీచేశారు.
ఇందులో భాగంగా... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే నివేదిక సిద్ధం చేసి తనకు సమర్పించాలని ఆదేశించారు. కాగా... ఏపీలో సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చే పనికి పూనుకుంటారని.. మాటమార్చే పరిస్థితి ఉండదని చెబుతున్న వేళ.. ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది కీలకంగా మారింది.