ఏపీ నూతన సీఎస్ గా నీరభ్ కుమార్ ప్రసాద్!
అవును... ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న వేళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు.
By: Tupaki Desk | 7 Jun 2024 5:36 AM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగడం, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవ్వడం ఫిక్స్ అయిన నేపథ్యంలో... అధికారుల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి! ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) గా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉతర్వ్యులు జారీ అయ్యాయి.
అవును... ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న వేళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. 1987 బ్యాచ్ కు చెందిన నీరభ్ కుమార్... ప్రస్తుతం ఏపీ ప్రహుత్వంలో రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
మరోపక్క ఇప్పటివరకూ ఏపీకి చీఫ్ సెక్రటరీగా ఉన్న కే.ఎస్. జవహార్ రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో నూతన సీఎస్ గా నీరభ్ కుమార్ ప్రసాద్ నియామకం జరిగింది. ఇదే సమయంలో కొత్త సీఎస్ గా నీరభ్ కుమార్ నియామకం జరిగినందున కే.ఎస్. జవహార్ రెడ్డిని బదిలీ చేశారు.
కాగా... బుధవారం ఉదయం చంద్రబాబును నీరభ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో గురువారం... చంద్రబాబును కేఎస్ జవహర్ రెడ్డితో పాటు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలు కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో... కొత్త ప్రభుత్వం ఏర్పాటు ముందు కీలక మార్పులు జరుగుతున్నాయి.