Begin typing your search above and press return to search.

విదేశాలకు పారిపోయిన వదిలిపెట్టం.. నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు

దేశంలో కోట్లాది రూపాయల అప్పులు తీసుకొని పారిపోయిన వారిపై పార్లమెంట్ అట్టుడికింది.

By:  Tupaki Desk   |   18 Dec 2024 5:30 PM GMT
విదేశాలకు పారిపోయిన వదిలిపెట్టం.. నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు
X

దేశంలో కోట్లాది రూపాయల అప్పులు తీసుకొని పారిపోయిన వారిపై పార్లమెంట్ అట్టుడికింది. వారిపై తీసుకుంటున్న చర్యలపై కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం వాటిపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఆర్థిక నేరగాళ్ల విషయంలో తీసుకుంటున్న చర్యలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభను ఉద్దేశించి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఆర్థిక నేరగాళ్ల పట్ల ఈడీ తీసుకుంటున్న చర్యలు.. రికవరీ చేసిన ఆస్తులను లెక్కలతో సహా వివరించారు. అందులో ముఖ్యంగా విజయ్ మాల్యా నుంచి రూ.14,131 కోట్లు ఈడీ విజయవంతంగా స్వాధీనం చేసుకుందని వెల్లడించారు.

అలాగే.. నీరవ్ మోదీ నుంచి రూ.1,052 కోట్ల ఆస్తులను ఇద్దరివి కలిపి రూ.22,280 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. తాను ప్రధానమైన కేసుల గురించి మాత్రమే మాట్లాడుతున్నానని, వాటిని ప్రభుత్వ రంగ బ్యాంకులకు పునరుద్ధించామని తెలిపారు. నీరవ్ మోదీ విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు రూ.1,052.58 కోట్లు పునరుద్ధరించినట్లు తెలిపారు. వారం దేశం విడిచి పారిపోయినప్పటికీ ఎవరినీ వదిలిపెట్టడం లేదని స్పష్టం చేశారు.

నీరవ్ మోదీ, విజయ్ మాల్యాతోపాటు నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ కుంభకోణం నుంచి రూ.17.47 కోట్లు రికవరీ చేసి బ్యాంకులు ఇచ్చామని మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే.. ఎస్ఆర్ఎస్ గ్రూపు నుంచి రూ.20.15 కోట్లు, రోజ్ వ్యాలీ నుంచి రూ.19.40 కోట్లు, మొత్తంగా రూ.185.13 కోట్లు రికవరీ చేసినట్లు స్పష్టం చేశారు. వీటితోపాటు సూర్య ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ నుంచి మెహుల్ చోక్సీ కేసులో రూ.2,565.90 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు తెలిపారు. వీటిని వేలం వేయనున్నట్లు తెలిపారు.

ఇక.. విదేశీ నల్లధనంపైనా మంత్రి మాట్లాడారు. విదేశీ ఆస్తులను వెల్లడించే పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2021-22లో 60,467 ఉందని.. 2024-25 నాటికి 2 లక్షలకు పెరిగిందని తెలిపారు. చట్టం ప్రకారం.. జూన్ 2024 నాటికి 697 కేసుల్లో రూ.17,520 కోట్లుకు పైగా డిమాండ్ పెరిగిందన్నారు. ఏప్రిల్-అక్టోబర్ 2024-25లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉందని తెలిపారు. ఎన్డీయే పాలనలో మెరుగైన ద్రవ్యోల్బణం ఉందని, యూపీఏ హయాంలో ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరుకుందని విమర్శించారు.