ప్రణబ్ ముఖర్జీ సరసన నిర్మలమ్మ పేరు : వరుసగా 8 బడ్జెట్ల సమర్పణ
పేదరికం లేని సమాజం కోసం తమ బడ్జెట్ ను రూపొందించామని చెబుతూ అనేక వర్గాలపై వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా రైతులు, యువత, విద్యార్థులకు భారీ నజరానాలు ప్రకటించారు.
By: Tupaki Desk | 1 Feb 2025 7:06 AM GMTప్రధాని మోదీ 3.0 ప్రభుత్వంలో తొలి బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ‘‘దేశమంటే మట్టికాదయో.. దేశమంటే మనషులోయ్’’ అంటూ మన గురజాడ పద్యాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు నిర్మలా సీతారామన్. పేదరికం లేని సమాజం కోసం తమ బడ్జెట్ ను రూపొందించామని చెబుతూ అనేక వర్గాలపై వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా రైతులు, యువత, విద్యార్థులకు భారీ నజరానాలు ప్రకటించారు.
మోదీ 3.0 ప్రభుత్వంలో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వరుసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా అరుదైన ఘనత సాధించారు. ప్రధాని మోదీ తొలి ప్రభుత్వంలో తొలిసారి రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సతీరామన్ 2017లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి వరుసగా బడ్జెట్లు ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ ప్రస్తుతం తన 8వ బడ్జెట్ సభకు సమర్పించారు.
స్వతంత్ర భారత దేశంలో 10 బడ్జెట్ లను ప్రవేశపెట్టిన ఘనత దివంగత మాజీ ప్రధాని మోరార్జీ దేశాయ్ పేరిట ఉంది. ఆ తర్వాత మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం తొమ్మిదిసార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ కు ముందు 8 సార్లు బడ్జెట్ సమర్పించిన వారిలో ప్రణబ్ ముఖర్జీ ఉన్నారు. నేటి బడ్జెట్ తో ప్రణబ్ సరసన నిర్మలా పేరు చేరింది.