Begin typing your search above and press return to search.

నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకూ : బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రధానులు !

అప్పటి ఆర్ధిక మంత్రి డీడీ క్రిష్ణమాచారి ముంద్రా కుంభకోణం విషయంలో ఆరోపణల తరువాత రాజీనామా చేశారు.

By:  Tupaki Desk   |   22 July 2024 3:29 AM GMT
నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకూ : బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రధానులు !
X

సాధారణంగా బడ్జెట్ ని ఆర్ధిక మంత్రి ప్రవేశపెడతారు. అయితె కొన్ని అనివార్య పరిస్థితుల్లో ప్రధానులు కూడా బడ్జెట్ ని ప్రవేశపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కసారి చరిత్ర పుటలను తిరగవేస్తే దేశానికి తొలి ప్రధాని పండిట్ నెహ్రూ 1958లో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. అప్పటి ఆర్ధిక మంత్రి డీడీ క్రిష్ణమాచారి ముంద్రా కుంభకోణం విషయంలో ఆరోపణల తరువాత రాజీనామా చేశారు.

దాంతో ప్రధానిగా ఉన్న నెహ్రూ స్వయంగా వార్షిక బడ్జెట్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఇక నెహ్రూ తరువాత మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉంటూ 1977 నుంచి 1979 మధ్య మూడేళ్ళ కాలంలో పూర్తి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. అంతకు ముందు ఆయన ఇందిరాగాంధీ కేబినెట్లో ఆర్ధిక మంత్రిగా ఉంటూ 1967 నుంచి మరో మూడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.

ఆయన ఆర్ధిక మంత్రిగా రాజీనామా చేయడంతో ప్రధాని హోదాలో ఉన్న ఇందిరా గాంధీ 1970 ప్రాంతంలో జరిగిన బడ్జెట్ సమావేశాలో వార్షిక బడ్జెట్ ని సభకు సమర్పించారు. ఇక రాజీవ్ గాంధీ కూడా ప్రధానిగా ఉంటూనే ఒకసారి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఆయన మంత్రివర్గంలో ఆర్ధిక మంత్రిగా ఉంటూ వచ్చిన విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ తన పదవికి రాజీనామా చేయడంతో రాజీవ్ 1987 ప్రాంతంలో బడ్జెట్ ని సమర్పించాల్సి వచ్చింది.

ఇక ఆర్ధిక మంత్రిగానే రాజకీయాల్లోకి వచ్చి సంచలనం సృష్టించిన మన్మోహన్ సింగ్ కధ తెలిసిందే. ఆయన పీవీ నర సింహారావు ప్రధాని గా ఉండగా అయిదేళ్ల పాటు బడ్జెట్ ని సభకు సమర్పించారు. ఇక ఆర్ధిక మంత్రిగా మంచి పేరుని ఆయన తెచ్చుకున్నారు. ఆయన హయాంలోనే ఆర్థిక సంస్కరణలు దేశానికి కొత్త దారిని చూపించాయి. భారత దేశం ఆర్ధిక అభివృద్ధిని కొత్త పుంతలు సృష్టించిన ఘనత కూడా మన్మోహన్ సింగ్ కే దక్కుతుంది.

ఇక ఈ దేశంలో ఆరు సార్లు బడ్జెట్ ని ప్రవేశపెట్టిన రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ది అయితే ఆయన రికార్డుని గత ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ సమానం చేశారు. ఇపుడు ఏడవ సారి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం ద్వారా ఆమె సరికొత్త రికార్డును సాధిస్తున్నారు.

నిర్మాలా సీతారామన్ గత ప్రభుత్వంలో అయిదేళ్ల పాటు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. అలాగే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని కూడా సభకు సమర్పించారు. ఈసారి పూర్తి బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నారు. అందులో దేశానికి ఏ మలుపు పిలుపు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ నెల 23వ తేదీ వరకూ ఆగాల్సిందే. ఆ రోజున ఆమె కేంద్ర బడ్జెట్ ని ప్రవేశ పెడతారు అని అంటున్నారు.