Begin typing your search above and press return to search.

రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్ !

తాజాగా మోడీ ప్రభుత్వంలో మూడో సారి మంత్రి పదవి దక్కింది.

By:  Tupaki Desk   |   10 Jun 2024 5:16 AM GMT
రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్ !
X

బీజేపీ ఎంపీ నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు సృష్టించారు. మోదీ కేబినెట్లో మూడు సార్లు మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక మహిళా ఎంపీగా నిలిచారు.

2014లో పరిశ్రమలు, వాణిజ్య మంత్రిగా, ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన ఆమె 2019లో గెలిచాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా మోడీ ప్రభుత్వంలో మూడో సారి మంత్రి పదవి దక్కింది.

ఈసారి మోడీ కేబినెట్ లో ఏడుగురు మహిళలకు చోటు దక్కింది. వారిలో ఇద్దరు కేబినెట్‌ హోదా పొందారు. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్‌తో పాటు బీజేపీ ఎంపీలు అన్నపూర్ణాదేవి, శోభా కరంద్లాజే, రక్షా ఖడ్సే, సావిత్రి ఠాకుర్, నిముబెన్‌ బాంభణియా, అప్నాదళ్‌ ఎంపీ అనుప్రియా పటేల్‌ లు మంత్రి పదవులు సొంతం చేసుకున్నారు.

నిర్మలా సీతారామన్, అన్నపూర్ణాదేవి కేబినెట్‌ హోదా పొందగా, మిగిలినవారు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ప్రభుత్వంలో 10 మంది మహిళా మంత్రులు ఉండగా, ఈసారి ఆ సంఖ్య 7కు తగ్గింది.