Begin typing your search above and press return to search.

230 సీట్లు రాకుంటే మాట్లాడే హక్కు లేదా నిర్మలా జీ ?

అదేటో రాజకీయాలు ప్రజాస్వామ్యాలు అన్నీ సంఖ్యా స్వామ్యాలు అయిపోయాయి.

By:  Tupaki Desk   |   24 July 2024 10:56 AM GMT
230 సీట్లు రాకుంటే మాట్లాడే హక్కు లేదా నిర్మలా జీ ?
X

అదేటో రాజకీయాలు ప్రజాస్వామ్యాలు అన్నీ సంఖ్యా స్వామ్యాలు అయిపోయాయి. అధికారంలో ఉన్న వారికి ఎవరైనా ప్రశ్నించ బోతే మీకు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు వచ్చాయని వెంటనే గద్దిస్తారు. అసలు ఈ దేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతీ పౌరుడూ ప్రశ్నించవచ్చు అన్న మౌలిక సూత్రాన్ని ఎందుకు గుర్తించరో అర్ధం కాదు.

దేశంలో వందల కోట్ల మంది పౌరులు ఉన్నారు. అంతమందీ చట్ట సభలకు వెళ్లలేరు. అలాంటిది వారి ప్రతినిధిగా గెలిచిన వారు కూడా బలమైన పార్టీలుగా ఉండాలని ఆయా పార్టీలకు వచ్చిన నంబర్ గొప్పగా ఉండాలని కొత్త లెక్కలేవే ముందుకు తెస్తున్నారా అన్న డౌట్లు అయితే కలగక మానదు.

ఇదిలా ఉంటే కేంద్ర ఆర్ధిక మంత్రి హోదాలో నిర్మాలా సీతారామ ఏడవసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మీద నెటిజన్ల నుంచి అంతా తలో విధంగా స్పందిస్తున్నారు. అది వారికి ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్చ. ఇక పార్లమెంట్ లో ఇండియా కూటమి పార్టీలు నుంచి వచ్చి పడుతున్న ప్రశ్నలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సహా ఎన్డీయే ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

దాంతో వారు కౌంటర్ గా మీకు వచ్చిన సీట్లు ఎన్ని అంటూ ఎకసెక్కం ఆడుతున్నారు. నిర్మలా సీతారామన్ అదే పని చేశారు. ఇండియా కూటమికి 230 సీట్ల కంటే తక్కువ వచ్చాయని నిర్మలా సీతారామన్ అంటున్నారు. అయితే దేశంలోని జనాలకు బోధపడని విషయం ఏమిటి అంటే 230 కంటే సీట్లు వచ్చిన కూటమి నుంచి ఏ ఒక్క పార్టీ మాట్లాడకూడదా అని.

ఆ విధంగా ఏమైనా నిబంధనలు ఉన్నాయా అని కూడా ప్రశ్నిస్తున్నారు. 230 కంటే తక్కువ సీట్లు వస్తే మాట్లాడే హక్కు లేదా అని అంటున్నారు. ఈ దేశంలోని పౌరులు అంతా టాక్స్ పేయర్స్ గానే ఉన్నారు. ఒక విధంగా చూస్తే వారంతా హక్కుదారులే అని కూడా చెప్పాలి. మరి ఈ ప్రజలను వారి అభిప్రాయాలను కూడా బుల్డోజ్ చేయాలనుకుంటే ఎలా అన్న చర్చ కూడా వస్తోంది.

ప్రజాస్వామ్యంలో బలం అంటే ఎంత మంది ప్రజలకు సంబంధించి మాట్లాడుతున్నామన్న అంశమే తప్ప సీటూ ఓట్లు లెక్క కాదు అన్నది ఉంది. కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన విషయాలను చట్ట సభలలో ప్రస్తావించే సభ్యుడు పార్టీకి ఎక్కువ సీట్లు రాకపోవచ్చు. అంత మాత్రం చేత ఆయన లేవనెత్తిన అంశం పక్కకు పెట్టేస్తారా అన్నది కూడా ఆలోచించాలి.

అంకెల లెక్కలు అన్నవి అధికారం అందుకోవడానికే తప్ప మరి దేనికీ కాదని కూడా గుర్తెరగాలని అంటున్నారు. చట్ట సభలలో పాలించే పక్షం ప్రతిపక్షానికి నేరుగానూ ప్రజలతో పరోక్షంగానూ జవాబుదారీగా ఉండాలి. అలాంటపుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అలా కాకుండా బుల్డోజ్ చేసుకుంటూ పోతామని ఎవరైనా అనుకున్నా అది ఇబ్బదికరమే అవుతుంది.

ఈ విషయంలో ప్రతిపక్షానికి వచ్చిన సీట్లను లెక్కలోకి తీసుకోకుండా వారు లేవనెత్తే అంశాలకే విలువ ఇవ్వాలని కోరుతున్నారు. మొత్తం మీద చూస్తే కనుక ఎవరు అధికారంలో ఉన్నా ఈ రకమైన స్పూర్తిని అలవాటు చేసుకుంటే ఈ ఎకసెక్కాలు సెటైర్లు ఇక మీదట వినిపించకుండా ఉంటాయని కూడా మేధావులు ప్రజాస్వామ్య ప్రియులు సూచిస్తున్నారు.