నీతా అంబానీ ఆభరణం 200కోట్లు.. చీర 50లక్షలు
ముఖేష్ అంబానీ భార్య, నీతా అంబానీ సిరి సంపదలలోనే కాకుండా, స్టైల్ అండ్ ఫ్యాషన్ సెన్స్ పరంగాను యువతరం దృష్టిని ఆకర్షిస్తున్నారు.
By: Tupaki Desk | 12 March 2024 9:55 AM GMTముఖేష్ అంబానీ భార్య, నీతా అంబానీ సిరి సంపదలలోనే కాకుండా, స్టైల్ అండ్ ఫ్యాషన్ సెన్స్ పరంగాను యువతరం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈవెంట్లు కుటుంబ కార్యక్రమాలలో నీతాజీ ధరించే చీరలు, నగలు ఇతర అలంకరణ వస్తువులు పబ్లిక్ దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. ఇంతకుముందు పెళ్లిలో నీతాజీ ధరించిన ఆభరణం ఖరీదు చూసి అంతా నోరెళ్లబెట్టారు.
ఇప్పుడు మిస్ వరల్డ్ 2024 ఈవెంట్లో మొఘల్ చక్రవర్తులు రాణులకు చెందిన ఆభరణాలలో నీతా అంబానీ అబ్బురపరిచింది. ముంబైలో జరిగిన ఈవెంట్లో నీతా అంబానీ తన వేషధారణ ఉపకరణాలతో మరోసారి వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. మెరిసే చేనేత చీరలో ట్రెడిషనల్ గా కనిపించిన నీతా మోడ్రన్ లుక్ లో కనిపించింది. బనారసీ చీర, మెరిసే బంగారం జరీతో చేత్తో రూపొందించిన జంగ్లా డిజైన్ చీరలో కనిపించింది. ఈ చీర భారతదేశ సంస్కృతి... గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబించడమే కాకుండా ఆమె రాజరిక సౌరభాన్ని కూడా ఆవిష్కరించింది. మీనాకరి డీటెయిలింగ్.. పూల జాలు తో సంప్రదాయ హస్తకళా నైపుణ్యంతో రూపొందించిన చీరలో ప్రత్యేకంగా కనిపించింది.
మిస్ వరల్డ్ 2024లో మొఘల్ చక్రవర్తికి చెందిన ఆభరణాలలో నీతా అంబానీ అబ్బురపరిచింది. నీతాజీ ఎంపిక నిజంగా స్పాట్‌లైట్‌ను దోచుకుంది. తన చేతికి ఉన్న అలంకారం ఆర్మ్‌బ్యాండ్ చరిత్రలోని ప్రఖ్యాత మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు చెందిన కల్గీ అని తెలిసింది. టోపోఫిలియా అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ లో ఈ ఆభరణం కనిపించింది. దీని ఖరీదు సుమారు 200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇది ఐశ్వర్యం వారసత్వానికి అసాధారణ చిహ్నంగా నిలుస్తుంది. ఈ ఆర్మ్‌బ్యాండ్ 13.7 సెం.మీ ఎత్తు , 19.8 సెం.మీ వెడల్పుతో ఉంది. సాంప్రదాయ పచ్చికకామ్ టెక్నిక్‌ని ఉపయోగించి బంగారంతో అమర్చిన వజ్రాలు, కెంపులు, స్పినెల్‌లతో ఎంతో గొప్పగా దీనిని తయారు చేసారు.
ఫ్యాషన్‌లో రాణించాలనే నీతా అంబానీ నిబద్ధత వల్లనే ఈ నగల సేకరణ సాధ్యమైంది. 2018లో తన కుమార్తె ఇషా అంబానీ పెళ్లి రోజు కోసం నీతాజీ తన బృందంతో ప్రత్యక్షమై షాకిచ్చింది. అద్భుతమైన ఆల్-డైమండ్ నగలతో అలంకరించుకుని పెళ్లి వేదికకు వచ్చింది. ముఖ్యంగా డైమండ్ నాథ్, వజ్రాల పొరలు, భారీ 1LB డైమండ్ లాకెట్టుతో అలంకరించిన ఆభరణం అహూతులందరినీ ఆకర్షించింది. పెళ్లి వేడుకలో నీతాజీ కేంద్ర బిందువుగా మారింది.
ఇంకా ప్రత్యేకమైన చీరల విషయంలోను నీతా అంబానీ ప్రవృత్తి ముఖ్యమైన ఈవెంట్లలో స్పష్టంగా కనిపిస్తుంది. 2015లో నీతాజీ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO అయిన పరిమల్ నత్వానీ కుమారుడి వివాహానికి చెన్నై సిల్క్స్‌కి చెందిన శివలింగం రూపొందించిన అత్యద్భుతమైన తెలుపు - గులాబీ మిశ్రమ రంగు చీరను ధరించి వేడుకలో షో స్టాపర్ గా నిలిచారు. వైట్ అండ్ పింక్ గులాబీ చీర వెనక భాగంలో శ్రీకృష్ణ భగవానుని స్ఫురద్రూపాన్ని ముద్రించిన ఈ చీర క్లిష్టమైన ఎంబ్రాయిడరీని కలిగి ఉంది. నిజమైన బంగారు దారాలు, వజ్రాలు, పచ్చలు, కెంపులు, పుఖ్‌రాజ్‌లతో అలంకరించిన ఈ చీర నీతాజీ విలాసానికి చిహ్నంగ నిలుస్తుంది. ఈ అత్యద్భుతమైన చీర ధర రూ. 40 లక్షలు. ఇది సున్నితమైన హస్తకళలు లగ్జరీపై నీతా అంబానీకి ఉన్న ప్రవృత్తికి నిదర్శనం.