Begin typing your search above and press return to search.

నీతా అంబానీ జీతం రూ.800... పిల్లలకు పాకెట్ మనీ రూ.5!

ఆమెది మొదటి నుంచీ సాధారణ మధ్యతరగతి మనస్తత్వమని.. ఆత్మాభిమానానికి ఆమె అధిక ప్రాధ్యాన్యత ఇస్తారని ఆమె సన్నిహితులు చెబుతుంటారు.

By:  Tupaki Desk   |   7 March 2024 2:30 PM GMT
నీతా అంబానీ జీతం రూ.800... పిల్లలకు  పాకెట్  మనీ రూ.5!
X

"ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రైవేట్ ఫ్యామిలీ ఈవెంట్"గా నిలిచిన అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో ప్రధానంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు నీతా అంబానీ అని చెప్పిన వారే ఎక్కువ! ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రెటీలు, అతిరథ మహారథులు విచ్చేసినా.. చాలా మందికి మాత్రం నీతా అంబానీనే సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆమె గురించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అవును... ప్రపంచ వ్యాప్తంగా కూడా అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో ప్రధానంగా ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ధరించిన దుస్తులు, నగలు మరో హాట్ టాపిక్ అని అంటున్న వేళ... వేడుకల్లో చివరి రోజు నీతా అంబానీ చేసిన క్లాసికల్ డ్యాన్స్, అందుకు ఆమె ధరించిన చీరకున్న ప్రత్యేకత మరింత వైరల్ గా మారిందని అంటున్నారు.

అయితే... ఇప్పుడు ప్రపంచం చూస్తున్న నీతా అంబానీ వేరు.. ఆమె ధరించిన నగలు, దుస్తులు వందల కోట్లు కావొచ్చు.. ఆమె వేల కోట్ల ఖరీదైన భవంతిలో ఉండొచ్చు కానీ.. ఆమెది మొదటి నుంచీ సాధారణ మధ్యతరగతి మనస్తత్వమని.. ఆత్మాభిమానానికి ఆమె అధిక ప్రాధ్యాన్యత ఇస్తారని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. దీనికోసం వారు చెప్పే కొన్ని ఉదాహరణలు ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ అవి అక్షర సత్యాలని చెబుతారు.

ముంబైలో స్థిరపడిన గుజరాతీ కుటుంబానికి చెందిన నీతా... కమర్స్ లో డిగ్రీ చేయడంతోపాటు భరత నాట్యంలోనూ ప్రావీణ్యం సంపాదించారు. ఈ క్రమంలోనే ఒక రోజు ఆమె నృత్య ప్రదర్శన చూసిన ధీరూభాయ్ దంపతులు... తమ పెద్ద కొడుకు ముఖేష్ కి తగిన జోడీ అనుకున్నారట. అయితే అప్పటికే పేరుమోసిన ధనవంతుల సంబంధం అని నీతా ఎగిరి గంతేయలేదు సరికదా.. అంబానీ ఫ్యామిలీకి కండిషన్స్ పెట్టారట.

ఇందులో భాగంగా ముందుగా ముకేష్ తో మాట్లాడి.. అభిప్రాయాలు కలిసిన తర్వాతే పెళ్లికి సరే అని చెప్పిన నీతా... పెళ్లైన తర్వాత కూడా తనను ఉద్యోగం చేసుకోనివ్వాలని కూడా షరతు పెట్టారంట. ఆ సమయంలో స్కూల్ టీచర్ గా పనిచేసిన నీతా జీతం రూ. 800 కావడంతో... అంబానీ కోడలికి ఇదేపాటనే కామెంట్లు కొలీగ్స్ నుంచి వినిపించేవంట. అయితే... అది తన ఆత్మగౌరవం అనేది నీతా సమాధానంగా వచ్చేదని చెబుతారు నాటి కొలీగ్స్!!

ఇక తన జీతంలోనే ప్రతీ శుక్రవారం పిల్లలకు రూ. 5 రూపాయలు ఇచ్చేవారంట నీతా! ఇక ఈ విషయంలో కూడా పిల్లల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ... సర్దుకుపోతూ, వారికి సర్ధిచెబుతూ కోట్లకు వారసులైనా తన పిల్లలను మధ్యతరగతి వారిలానే పెంచారట నితా!!