220కోట్లతో దేశంలోనే ఖరీదైన బర్త్‌డే పార్టీ
రాజులు - రాణులకు ఈ రేంజ్ పుట్టినరోజు వేడుకలు లేవ్. వేదికపైకి కింగ్ ఖాన్.. బిగ్ బి..ఏ.ఆర్.రెహమాన్ వంటి ప్రముఖ ముఖాలు విచ్చేసాయి.
By: Tupaki Desk | 1 Oct 2023 9:19 AM GMTరాజులు - రాణులకు ఈ రేంజ్ పుట్టినరోజు వేడుకలు లేవ్. వేదికపైకి కింగ్ ఖాన్.. బిగ్ బి..ఏ.ఆర్.రెహమాన్ వంటి ప్రముఖ ముఖాలు విచ్చేసాయి. పీసీ-రెహమాన్ లైవ్ షోలు ఇచ్చారు. దేశంలోనే అత్యంత ఖరీదైన పుట్టినరోజు వేడుకగా ఇది చరిత్రకెక్కింది. ఇంతకీ ఈ పుట్టినరోజు ఎవరది? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
ప్రపంచంలోనే నంబర్ 1 సంపన్నుడిగా రికార్డులకెక్కిన ది గ్రేట్ బిజినెస్‌మేన్ ముఖేష్ అంబానీ కుటుంబంలో పుట్టినరోజు వేడుక గురించే ఇదంతా. అంబానీ భార్య నీతా అంబానీ 50వ పుట్టినరోజు వేడుకను ఇంత ఘనంగా నిర్వహించారు. రాజస్థాన్ నగరం జోధ్‌పూర్ ఆరోజు అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఇది గత సార్వత్రిక ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు.. భారతదేశంలో మునుపెన్నడూ చూడని వేడుక. ఈ పండుగకు హాజరు కావడానికి భారతదేశంలోని ప్రముఖులు తమ ప్రైవేట్ జెట్‌లలో దిగారు. ఈ పుట్టినరోజుకు భారతదేశపు అతిపెద్ద కంపెనీ పంపిన చార్టర్డ్ విమానంలో అతిథులు ప్రయాణించారు.
నీతా అంబానీ 50వ జన్మదిన వేడుకలకు వేదికగా అంబానీలు రెండు రాజభవనాలను బుక్ చేసుకున్నారు. ఉమైద్ భవన్ ప్యాలెస్ .. బాల్సమండ్ లేక్ ప్యాలెస్. ఈ వేడుకలకు దాదాపు 300 మంది వీవీఐపీ అతిథులుగా హాజరయ్యారని అప్పట్లో వార్తలు వచ్చాయి. వీటిలో గోద్రెజ్‌లు, మిట్టల్స్, మహీంద్రాలు వంటి కొన్ని సంపన్న వ్యాపార కుటుంబాలు ఉన్నాయి. షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, ఏ.ఆర్.రెహమాన్, ప్రియాంక చోప్రా, రాణి ముఖర్జీ వంటి A-లిస్టర్‌లతో పాటు సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, ముంబై ఇండియన్స్ IPL టీమ్ ఆటగాళ్లు.. ఇతర ప్రముఖ తారలు అతిథుల జాబితాలో ఉన్నారు. ఆరోజు జోధ్‌పూర్ ఎయిర్‌పోర్ట్ కిటకిటలాడింది. అక్కడ విమానాల కోసం స్థలం లేకుండా పోయింది. పార్కింగ్ కోసం చాలా ప్రైవేట్ జెట్‌లను ఢిల్లీ, జైపూర్, ఉదయపూర్‌లకు పంపాల్సి వచ్చింది.
జోధ్‌పూర్ రెండు రోజుల పాటు చాలా కాలం తర్వాత స్టార్లు సెలబ్రిటీలతో నిండిపోయింది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ మాస్ట్రో AR రెహమాన్ ఈ వేదికపై ప్రదర్శనలు ఇచ్చారు. ఈ భారీ వేడుక అత్యంత చిరస్మరణీయమైంది. ఇప్పుడు కుటుంబ వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్న నీతా - ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కూడా ప్రత్యేక ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ప్రముఖ వ్యాపార దిగ్గజం ధీరూభాయ్ అంబానీ కుటుంబ పితామహుడు ధీరూభాయ్ అంబానీని సత్కరిస్తూ స్పెషల్ ఎఫెక్ట్‌లతో కూడిన లైట్ షో ఈ వేడుకల్లో మరొక హైలైట్. నీతాజీ పుట్టినరోజు వేడుకలు 31 అక్టోబర్ 2013న ప్రారంభమయ్యాయి. నవంబర్ 1న నీతా అంబానీ 50వ పుట్టినరోజు వేడుకలతో ఇవి ముగిసాయి. రెండు రోజుల పాటు ఘనంగా కొనసాగాయి..
ఒకటవ రోజు పార్టీలో యూత్ ఫుల్ గా అందరూ చిల్ అయ్యారు. నో-హోల్డ్ బార్ర్డ్ పార్టీ, కేక్ కటింగ్, సంగీతం, డ్యాన్స్ బాలీవుడ్ తారల ప్రదర్శనలతో హోరెత్తింది. ఈ పుట్టినరోజు వేడుకలో భిన్నమైన థీమ్ ఆకట్టుకుంది. ది ధన్తేరస్ పవిత్రమైన పండుగతో సమానంగా జరిగింది. అంబానీ కుటుంబ సభ్యులు .. సన్నిహితులు విస్తృతమైన పూజలో పాల్గొన్నారు. కొన్ని ప్రత్యేక ప్రదర్శనలను నిర్వహించారు. ఆ తర్వాత బాల్ సమంద్ లేక్ ప్యాలెస్‌లో సంప్రదాయ విందును ఏర్పాటు చేశారు. మొత్తం ఈ పార్టీ కోసం రూ.220 కోట్లు (30 మిలియన్ డాలర్లు) ఖర్చయినట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్లు ఎందరో ఉన్నారు. వారు వందల కోట్లు వెచ్చించి తమ పుట్టినరోజులు జరుపుకున్నారని గతంలో మీడియాలో కథనాలొచ్చాయి. నిజానికి పుట్టినరోజులను మించి పెళ్లి వేడుకల కోసం భారీగా ఖర్చు చేస్తున్న వైనం చూస్తూనే ఉన్నాం.