మోడీకి బీహారీ బాబు నితీష్ క్లారిటీ ఇచ్చేశారా ?
ఏపీలో తెలుగుదేశం బీహార్ లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ ఎన్డీయేకు ప్రాణావసరంగా ఈ రోజు మారాయి.
By: Tupaki Desk | 29 Oct 2024 5:30 AM GMTకేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రెండు ఊతకర్రల మీద ఆధారపడి సాగుతోందని ఇండియా కూటమి నుంచి తీవ్ర విమర్శలు వస్తూ ఉంటాయి ఏ క్షణాన అయినా ఎన్డీయే ప్రభుత్వం కూలిపోతుందని కూడా అంటూ జోస్యాలు చెబుతూ ఉంటారు. ఏపీలో తెలుగుదేశం బీహార్ లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ ఎన్డీయేకు ప్రాణావసరంగా ఈ రోజు మారాయి.
ఈ రెండు పార్టీలు కనుక ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే కచ్చితంగా మోడీ ప్రభుత్వం ఇబ్బందులో పడుతుంది. ఆ సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంలో పూర్తి స్థాయిలో దోస్తీ చేస్తున్నారు. ప్రతీ దానికీ ఆయన ఢిల్లీ వెళ్లి పెద్దలను కలుస్తున్నారు.
అరమరికలు లేకుండా ఈ దోస్తీ సాగుతోంది. అదే నితీష్ కుమార్ విషయం చూస్తే కనుక కొన్ని అనుమానపు మేఘాలు అయితే ప్రసరిస్తున్నాయి. దాంతోనే రాజకీయంగా ఎపుడూ అంతా బీహార్ వైపు చూస్తున్నారు. ఆ మధ్యన జేడీయూ కీలక నేత ఒకరు నితీష్ కుమార్ ప్రధాని అయితేనే దేశంలోని సమస్యలు పరిష్కారం అవుతాని కూడా ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.
మరో వైపు ఒక సందర్భంలో బీహార్ లోని ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో నితీష్ కుమార్ భేటీ అయ్యారన్న వార్తలు కూడా కొంత రాజకీయంగా అలజడి రేపాయి. ఇక నితీష్ కుమార్ విషయం తీసుకుంటే 2020లో బీజేపీతో పొత్తు పెట్టుకుని బీహార్ లో అధికారంలొకి వచ్చారు. ఆ తరువాత కొన్నాళ్ళకు ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి వైపు మళ్ళారు.
మళ్లీ అటు నుంచి ఎన్డీయే కూటమి వైపు వచ్చారు. ఇలా ఒక నాలుగేళ్ల కాలంలోనే ఆయన కూటములను మారుస్తూ రికార్డు క్రియేట్ చేశారు. దాంతో నితీష్ కుమార్ వైఖరి ఎలా ఉంటుందో అన్న ఆందోళన అయితే అందరిలో ఉంది.
దానిని ఆయన తాజాగా బీహార్ లో జరిగిన రాష్ట్ర ఎన్డీయే సమావేశంలో నివృత్తి చేశారు తాను ఎన్డీయేను వీడను అంటూ ఒక కచ్చితమైన స్టేట్మెంట్ ఇచ్చారు. తాను గతంలో ఇండియా కూటమి వైపు వెళ్ళి తప్పు చేశానని కూడా చెప్పుకున్నారు.
తాను ఎన్డీయేలో ఉంటూ 2025లో బీహార్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీని సాధించి మరోమారు అధికారం చేపడతామని స్పష్టం చేశారు. ఈసారి ఎన్డీయే కూటమి ఏకంగా 220 సీట్లను గెలుచుకుంటుందని ఆయన చెప్పడం విశేషం.
మరో వైపు బీహార్ బీజేపీ నేతలు తమ నాయకుడు నితీష్ కుమార్ అని చెప్పడమూ గమనార్హం. బీహార్ కి మరోసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారని వారు సంకేతాలు ఇస్తున్నారు. ఆయన నాయకత్వంలోనే ఎన్డీయే కూటమి ఎన్నికలను ఎదుర్కొంటుందని అంటున్నారు.
అంటే 2025లో మళ్లీ ఎన్డీయే గెలిస్తే నితీష్ కుమార్ వరసగా అయిదవసారి సీఎం అవుతారు అన్న మాట. సీఎం పదవికి నితీష్ కే కేటాయించాలని బీజేపీ తీసుకున్న తెలివైన నిర్ణయం వల్ల బీహార్ లో విజయావకాశాలు పెరగడంతో పాటు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం సుస్థిరతకు కూడా అవకాశం పెరిగింది అని అంటున్నారు.
మొత్తానికి కేంద్రంలో మూడవసారి ప్రధాని అయిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సొంతంగా బీజేపీకి మెజారిటీ దక్కకపోవడం కొంత ఆందోళన కలిగించినా నితీష్ కుమార్ లేటెస్ట్ స్టేట్మెంట్ తో క్లారిటీ వచ్చింది అని అంటున్నారు. సో ఇక మీదట జమిలి ఎన్నికల దాకా ఎన్డీయేకు ఢోకా లేదని అంటున్నారు