Begin typing your search above and press return to search.

జస్ట్ డిస్కషన్ : మళ్లీ మళ్లీ మోడీయే ప్రధానిగా...!

నరేంద్ర మోడీ మొదటి సారి బీజేపీకి పూర్తి మెజారిటీ దక్కడంతో దేశానికి తొలిసారి ప్రధాని అయ్యారు.

By:  Tupaki Desk   |   30 Oct 2024 4:30 AM GMT
జస్ట్ డిస్కషన్ :  మళ్లీ మళ్లీ మోడీయే ప్రధానిగా...!
X

నరేంద్ర మోడీ మొదటి సారి బీజేపీకి పూర్తి మెజారిటీ దక్కడంతో దేశానికి తొలిసారి ప్రధాని అయ్యారు. అది 2014లో బీజేపీ మోడీ నాయకత్వంలో సాధించిన ఘన విజయం. ఆ తరువాత 2019లో మరోసారి మంచి మెజారిటీతో ప్రధాని అయ్యారు. అయితే 2024లో మాత్రం బీజేపీకి జనాలు రివర్స్ లో తీర్పు ఇచ్చారు. మొత్తం 375 సీట్లు బీజేపీ సొంతంగా గెలుచుకుంటుందని ఎన్డీయే 400 మార్క్ ని దాటుతుందని బీజేపీ పెద్దలు ప్రచారంలో ఊదరగొట్టారు.

అయినా ఫలితం మాత్రం తేడా కొట్టింది. అయితే ఎన్డీయే మిత్రుల సాయంతో మోడీ మూడోసారి ప్రధాని అయ్యారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మోడీ మూడోసారి ప్రధాని అయి నాలుగైదు నెలలు కావస్తోంది. అపుడే నాలుగో టెర్మ్ కూడా ఆయనే ప్రధాని అంటున్నారు నితీష్ కుమార్.

జమిలి ఎన్నికలు జరిగినా మూడేళ్ళ వరకూ ఈ ప్రభుత్వం సాగాలి. ఒకవేళ అది కాదు అనుకుంటే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే 2029 దాకా ఈ సర్కార్ సాగాలి. బీజేపీకి పూర్తి మెజారిటీ లేని వర్తమాన పరిస్థితులలో ఎవరి మనసు ఎపుడు ఎలా ఉంటుందో మిత్రుల విషయం కూడా ఊహకు అందని నేపథ్యంలో నితీష్ కుమార్ మాత్రం మళ్లీ మళ్లీ మోడీయే ప్రధాని అని అంటున్నారు

అయితే మోడీ వయసు 2025 సెప్టెంబర్ 17 నాటికి 75 పూర్తిగా నిండి 76కి చేరుకుంటుంది. మోడీ అమిత్ షా తీసుకుని వచ్చిన బీజేపీలోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని చూస్తే కనుక మోడీ పదవీ కాలం ఒక ఏడాది మాత్రమే ఉంటుందని ప్రత్యర్ధులు అంటున్నారు ఇక వారి మాటను పక్కన పెట్టి మోడీని కొనసాగించినా 2029 నాటికి ఆయనకు ఏకంగా 79 ఏళ్ళు వస్తాయని అపుడు బీజేపీ గెలిచినా ఎన్డీయే మద్దతు ఇచ్చినా నాలుగవసారి మోడీకే పీఠం దక్కుతుందా అన్న చర్చ సొంత పార్టీలోనే ఉంది.

కానీ నితీష్ కుమార్ మాత్రం అభయం ఇస్తున్నారు. మోడీకి తిరుగులేదని అంటున్నారు. అయితే ఆయన మాటలు ఎంతవరకూ నమ్మవచ్చు అన్నది కూడా చర్చగా ఉంది. ఆయన ఏ ఎండకు ఆ గొడుకు పడతారు అని కూడా అంతా అంటున్న పరిస్థితి ఉంది. ఆయన తనకు అనుకూలం కాని చోట క్షణ కాలం కూడా ఉండరని అంటారు. అటువంటిది ఆయన ఇపుడు ఎన్డీయేను మోడీని బాగా కీర్తిస్తున్నారు అంటే వాతావరణం ఆయనకు ఏంటో తెలుసు కాబట్టే అంటున్నారు.

అయినా కానీ మళ్లీ మళ్లీ మోడీ ప్రధాని అంటే బీజేపీలోనే చాలా మందికి అంతగా నమ్మకం లేని వేళ మిత్రుడుగా కూడా కొంత డౌట్ ఉన్న నితీష్ కుమార్ ఈ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసి మోడీని ఉబ్బితబ్బిబ్బు చేద్దామని అనుకుంటున్నారు అని అంటున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ ఏంటో రాజకీయ వాతావరణం ఎలా ఉందో అన్నీ మోడీకి తెలియనివి కావు అని అంటున్నారు. మోడీ వరకు అయితే నాలుగవ సారి ప్రధాని కావడానికే చూస్తారు అని అంటున్నారు. అయితే ఆయన బయటకు చెప్పరు, యాక్షన్ ప్లాన్ మాత్రమే ఉంటుంది. నితీష్ లాంటి వారు ఇచ్చే స్టేట్మెంట్స్ కూడా జస్ట్ అలా చూసి ఊరుకోవడానికే అన్నది కూడా వినిపిస్తున్న మాట.