మోకాళ్లపై తిరుపతి మెట్లెక్కిన టీమిండియా నయా స్టార్... వీడియో వైరల్!
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాడు నితీశ్ కుమార్ రెడ్డి. అతడి ప్రదర్శనతో రాత్రి రాత్రి కోట్ల మంది ఫ్యాన్స్ పుట్టుకొచ్చినట్లు చెబుతున్నారు.
By: Tupaki Desk | 14 Jan 2025 4:28 AMఇటీవల భారత్.. ఆస్ట్రేలియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ పర్యటన జరిగింది. ఈ సిరీస్ తోనే టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు యంగ్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఆడిన తొలి టోర్నమెంట్ లోనే తనదైన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. విమర్శకుల ప్రశంసలు పొందాడు.
అవును... బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాడు నితీశ్ కుమార్ రెడ్డి. అతడి ప్రదర్శనతో రాత్రి రాత్రి కోట్ల మంది ఫ్యాన్స్ పుట్టుకొచ్చినట్లు చెబుతున్నారు. పైగా.. సీనియర్లు విఫలమైన చోట అతడు సత్తా చాటడంతో మరింత గుర్తింపును దక్కించుకున్నాడు, ప్రశంసలను పొందాడని అంటున్నారు.
ఈ క్రమంలో... తాజాగా తిరుమలకు వెళ్లాడు నితీశ్ రెడ్డి. ఈ క్రమంలో.. మెట్లమార్గంలో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నాడు. ఈ సమయంలో మోకాళ్ల పర్వతం వద్ద నితీశ్ మోకాళ్లెట్లెక్కాడు. దీనికి సంబంధించిన వీడియో ను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
కాగా... ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా... మెల్ బోర్న్ లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన నితీశ్... కీలక సమయంలో సెంచరీతో జట్టును ఆదుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో ఐదు మ్యాచ్ లలో 37.25 సగటుతో మొత్తం 298 పరుగులు చేశాడు.
ఈ టోర్నమెంట్ లో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ యువ ఆల్ రౌండర్ అత్యుత్తమ ప్రదర్శనకు క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల జల్లులు కురిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా మోకాళ్లపై మెట్లెక్కుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు నితీశ్ రెడ్డి.