Begin typing your search above and press return to search.

మోడీకి ప్రియ నేస్తం చంద్రబాబేనా ?

కేంద్రంలో మూడవసారి వరసగా అధికారంలోకి వచ్చిన ఆనందం అయితే బీజేపీ పెద్దలలో లేదు.

By:  Tupaki Desk   |   1 July 2024 4:04 AM GMT
మోడీకి ప్రియ నేస్తం చంద్రబాబేనా ?
X

కేంద్రంలో మూడవసారి వరసగా అధికారంలోకి వచ్చిన ఆనందం అయితే బీజేపీ పెద్దలలో లేదు. బీజేపీకి సొంతంగా మెజారిటీ లేదు. పైగా ఆ పార్టీ రెండు ఊత కర్రల లాంటి ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి అడుగులు వేస్తోంది. అందులో ఒకరు చంద్రబాబు, మరొకరు బీహార్ సీఎం నితీష్ కుమార్.

ఈ ఇద్దరూ రాజకీయంగా చూస్తే గండర గండలే. ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారు. ఇక బీహార్ లో నితీష్ పార్టీలను తరచూ మారుస్తూ ఉంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పార్టీలను మార్చినా పొత్తులు ఎత్తులూ వేసినా ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేస్తారు. ఆయన రాజకీయ కారణాలతో పొత్తులను విచ్చిన్నం చేసుకున్నది అయితే పెద్దగా లేదు

ఈ నేపధ్యంలోనే 2018లో ప్రత్యేక హోదా డిమాండ్ తో చంద్రబాబు ఎన్డీయే నుంచి వెనుతొలగారు. ఇక 2024లో ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నా అది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశమే. దాంతో బాబు విషయంలో మోడీకి నమ్మకం గతం కంటే కూడా ఈసారి పెరిగింది అని అంటున్నారు.

మోడీ చంద్రబాబుకు ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. ఏపీలో టీడీపీ ప్లస్ జనసేన 18 ఎంపీలు ఉన్నారు. అది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి ప్రాణవాయువు లాంటిది. దాంతోనే పవన్ ని తుఫాను అని బీజేపీ పెద్దలు అభివర్ణించినా బాబుని ప్రియ నేస్తంగా సంభోదించినా కూడా విషయం అందరికీ తెలుసు అని అంటున్నారు.

నితీష్ కుమార్ బీహార్ సీఎం గా 2005 నుంచి కొనసాగుతున్నారు. ఆయన ఇరవై ఏళ్ళుగా ఆ పదవిలో ఉన్నారు. ఆయన గతంలో ఎన్డీయే కూటమిలో ఉంటూ 2020లో జరిగిన ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు. ఆ తరువాత ఆయన ఆర్జేడీ తో కలసి వెళ్లారు. ఇండియా కూటమి ఆవిర్భావం వెనక నితీష్ కుమార్ ఉన్నారు. ఆయన ఆశ కూటమి తరఫున ఉమ్మడి ప్రధాని అభ్యర్ధిగా తన పేరు ఉంటుందని భావించడమే.

అయితే అక్కడా హెవీ కాంపిటేషన్ ఉండడంతో పాటు తన ఆశలు నెరవేరవని తెలిసి ఆయన ఎన్డీయే వైపు వచ్చారు. ఇక ఈ జన్మకు ఎన్డీయేని వీడి వెళ్లను అని నితీష్ చెబుతున్నా ఆయన మాటలు నమ్మేలా లేవు అని అంటున్నారు.

ఇండియా కూటమి ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించినా లేక ఉప ప్రధానిగా చేస్తూ కీలక శాఖలు ఇచ్చినా నితీష్ ఆ వైపుకే వెళ్తారు అని అంటున్నారు. 2025లో బీహార్ కి ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లోగా ఆయన ఇండియా కూటమిలోకి వెళ్ళినా వెళ్తారు అని అంటున్నారు. బీహార్ లో ఆర్జేడీ అధినేత లాలూ కుమారుడికి సీఎం సీటు ఇచ్చి తాను కేంద్రంలోకి వెళ్ళేలా ఒప్పందం ఉంటే నితీష్ ప్లేట్ ఫిరాయిస్తారు అని అంటున్నారు.

నితీష్ కన్ను ప్రధాని లేదా ఉప ప్రధాని మీద ఉందని అంటున్నారు. ఆయన ఏడున్నర పదుల వయసులో ఉన్నారు. రాజకీయంగా కూడా చివరి ఇన్నింగ్స్ లో ఉన్నారు. దీంతో తన మొత్తం రాజకీయ జీవితంలో ఉప ప్రధానిగా అయినా ఉన్నత స్థానం చూసి పదవీ విరమణ చేయాలన్నది నితీష్ కి కోరికగా ఉంది అని అంటున్నారు. ఆ కోరిక ఎన్డీయే తీరిస్తే ఓకే. కానీ బీజేపీలో మోడీ అమిత్ షా మాటే చెల్లుబాటు అవుతుంది. కేంద్రంలో తమకు అంత ఫ్రీ హ్యాండ్ ఉండదని నితీష్ భావిస్తే మాత్రం ఆయన ఇండియా కూటమి వైపు జంప్ అవుతారనే అంటున్నారు.

అయితే చంద్రబాబు పరిస్థితి అలా కాదు. ఆయన అయిదేళ్ళ పాటు ఏపీకి సీఎంగా ఉండాల్సిన పరిస్థితి. ఏపీని ఒక గాటికి చేర్చాలి. అపుడు ఆయన వారసుడు లోకేష్ గురించి ఆలోచిస్తారు. పైగా ఏపీకి నిధులను మాత్రమే బాబు కోరుతున్నారు.దాంతో బాబుతోనే బీజేపీకి ఇబ్బంది లేదు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే బీజేపీకి ప్రత్యేకించి మోడీకి ప్రియ నేస్తంగా బాబు ఉన్నారు అనడంలో సందేహం లేదని అంటున్నారు