Begin typing your search above and press return to search.

పవన్ లోకేష్ లకు నో చాన్స్... బాబు చెప్పాలనుకున్నదేంటి ?

అయితే ఇందులో పవన్ కళ్యాణ్ లోకేష్ బాబులకు నో చాన్స్ అన్నట్లుగానే కూర్పు చేశారు.

By:  Tupaki Desk   |   16 Oct 2024 3:44 AM GMT
పవన్ లోకేష్ లకు నో చాన్స్... బాబు చెప్పాలనుకున్నదేంటి ?
X

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు నెలల తరువాత జిల్లాలకు ఇంచార్జిలను నియమించింది. మొత్తం 26 జిల్లాలకు ఇంచార్జిలను నియమించారు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ లోకేష్ బాబులకు నో చాన్స్ అన్నట్లుగానే కూర్పు చేశారు.

ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వంలో మొత్తం 24 మంది మంత్రులు ఉన్నారు. అందులో పవన్ లోకేష్ ని మినహాయిస్తే ఇరవై రెండు మంది అవుతారు. ప్రతీ జిల్లాకు ఒక ఇంచార్జి మంత్రి అంటే నాలుగు జిల్లాలు ఖాళీగా ఉంటాయి. దాని కోసం కొందరిని రెండేసి జిల్లాల బాధ్యతలు అప్పగించారు.

అలా మొత్తం ఇంచార్జిల నియామకం చేపట్టారు. జిల్లా అభివృద్ధిలో ఇంచార్జిల పాత్ర అతి ముఖ్యమైనది. డీడీఆర్సీ మీటింగులు వారి అధ్యక్షతనే జరుగుతాయి. జిల్లా అభివృద్ధికి సంబంధించి వారి నాయకత్వంలోనే సమావేశాలు పెట్టి తీర్మానాలు చేస్తారు.

జిల్లాను మొత్తం రాజకీయంగా పాలనాపరంగా పూర్తిగా హోల్డ్ చేయాల్సిన బాధ్యత ఇంచార్జి మంత్రులదే. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఆలస్యం చేసింది అని అంటున్నారు. మొత్తానికి ఇంచార్జిల పదవులతో మంత్రుల బాధ్యతను మరింతగా పెంచారు.

అయితే ఇంత పెద్ద కసరత్తు చేసిన ముఖ్యమంత్రి కీలకమైన పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లను ఎందుకు పక్కన పెట్టారు అన్న చర్చ వస్తోంది. అయితే అక్కడే ఉంది అసలు లెక్క అని అంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి ఆయన మొత్తం స్టేట్ ని చూసుకుంటారు. ఆ హోదా అలాంటిది.

ఇక ఆయన పక్కన పవన్ కళ్యాణ్ ఉండనే ఉన్నారు. ఆయనది ఉప ముఖ్యమంత్రి పదవి. అంటే ఆయన కూడా మొత్తం స్టేట్ చూసుకుంటారు అన్న మాట. మరి ఈ ఇద్దరూ స్టేట్ లీడర్లు అయితే లోకేష్ ని జిల్లా ఇంచార్జి మంత్రిగా పంపిస్తే ఆయనని తగ్గించినట్లు అవుతుంది కదా అన్న లెక్కలేవో ఉన్నాయని అంటున్నారు.

లోకేష్ టీడీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన టీడీపీకి భావి వారసుడు, రేపటి రోజున కాబోయే సీఎం. అందుకే ఆయన స్థాయిని అలాగే ఉంచుతూ ఇంచార్జి మంత్రుల లిస్ట్ లో చాన్స్ ఇవ్వలేదని అంటున్నారు. ఇంచార్జి మంత్రుల లిస్ట్ విడుదల చేశాక ఒక కొత్త విషయం తెలిసింది అని కూడా అంటున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమికి త్రిమూర్తుల మాదిరిగా చంద్రబాబు లోకేష్ బాబు పవన్ బాబు ఉంటూ పాలన సాగిస్తున్నారు అని అంటున్నారు.

చంద్రబాబు సీఎం. ఇక పవన్ డిప్యూటీ సీఎం. లోకేష్ కూడా అనధికార డిప్యూటీ సీఎం ర్యాంకరే అని అంటున్నారు. అందుకే ఈ విధంగా కూర్పు చేశారు అని అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీ జిలా ఇంచార్జిల నియామకం విషయంలోనూ ఆచీ తూచీ వ్యవహరించారు అని అంటున్నారు.