Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కొత్వాల్ కీలక నిర్ణయం.. డీజేపై బ్యాన్

ఒకరికి ఒకరు పోటాపోటీగా వేడుకలు.. ఊరేగింపుల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న డీజేపై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   1 Oct 2024 1:01 PM GMT
హైదరాబాద్ కొత్వాల్ కీలక నిర్ణయం.. డీజేపై బ్యాన్
X

వేడుక ఏదైనా డీజే హోరుతో ఉక్కిరిబిక్కిరి అయ్యే ఉదంతాలు హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంటాయి. ఎలాంటి వేడుకైనా.. కార్యక్రమం అయినా డీజే మోత మోగుతుంది. అయితే.. డీజేల కారణంగా తీవ్రమైన శబ్దకాలుష్యంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒకరికి ఒకరు పోటాపోటీగా వేడుకలు.. ఊరేగింపుల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న డీజేపై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

డీజే శబ్ధం కారణంగాతాము తీవ్రఇబ్బందులకు గురవుతున్నామని.. డయల్ 100కు ఫిర్యాదులు పెరుగుతున్న వేళలో డీజేలపై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ఈ రోజు (మంగళవారం) జారీ చేశారు. దీనికి ముందు బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.

ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి.. నగర ఎమ్మెల్యేలు దానం నాగేందర్..రాజాసింగ్.. పాషాఖాద్రీ.. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్.. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.. రాచకొండ సీపీ సుధీర్ బాబుతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీజేపీలపై నియంత్రణ అవసరమన్న సీపీ ఆనంద్.. రెండేళ్లుగా డీజేల హోరు అంతకంతకూ ఎక్కువ అవుతోందని.. దీని కారణంగా పెద్ద ఎత్తున శబ్ద కాలుష్యం జరుగుతుందన్నారు. అయితే.. ఈసారి అది మరింత పెరిగి.. శ్రుతిమించినట్లుగా పేర్కొన్నారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తూ డీజేలను ఏర్పాటు చేసిన వారు ఎవరైనా సరే.. వారిపై చర్యలు తీసుకుంటామన్న ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్ సైతం ఈ అంశాన్ని గుర్తించారన్నారు. డీజేలపై బ్యాన్ కు ఎమ్మెల్యేలు దానం నాగేందర్.. మజ్లిస్ ఎమ్మెల్యే పాషా ఖాద్రీ తమ మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.