Begin typing your search above and press return to search.

జమిలిపై ‘తెలుగు’ పార్టీల మాటేంటి?

ఒక దేశం.. ఒకే ఎన్నికల పేరుతో దేశ వ్యాప్తంగా ఒకే దఫా ఎన్నికల్ని నిర్వహించే ప్రక్రియను చేపట్టాలని బీజేపీ మొదట్నించి చెబుతోంది.

By:  Tupaki Desk   |   19 Sep 2024 5:01 AM GMT
జమిలిపై ‘తెలుగు’ పార్టీల మాటేంటి?
X

ఒక దేశం.. ఒకే ఎన్నికల పేరుతో దేశ వ్యాప్తంగా ఒకే దఫా ఎన్నికల్ని నిర్వహించే ప్రక్రియను చేపట్టాలని బీజేపీ మొదట్నించి చెబుతోంది. దీని కారణంగా పాలనాపరమైన సమస్యలు తగ్గటం.. డెవలప్ మెంట్ లో దూసుకెళ్లటంతో పాటు.. భారీగా ఖర్చు మిగులుతుందన్నది వాదన. ఈ జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీలు సైతం పెద్ద ఎత్తున సానుకూలను వ్యక్తం చేశాయి. అదే సమయంలో.. కొన్ని పార్టీలు తమ అభిప్రాయాన్ని చెప్పకుండా ఉండిపోయాయి.

అలా చెప్పకుండా ఉండిపోయిన తెలుగు రాష్ట్రాల్లోని అధికార.. విపక్ష పార్టీలు ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. జమిలి ఎన్నికలపై కోవింద్ కమిటీ మొత్తం 62 పార్టీల అభిప్రాయాన్ని కోరింది. ఇందులో 47 పార్టీలు మాత్రమే రియాక్టు అయ్యాయి. 15 రాజకీయ పార్టీలు ఎలాంటి స్పందనను తెలియజేయలేదు. తమ స్టాండ్ ఏమిటన్న విషయాన్ని చెప్పిన 47పార్టీల్లో 32 పార్టీలు అనుకూలంగా ఓటేస్తే.. పదిహేను పార్టీలు మాత్రం నో చెప్పేశాయి.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జమిలి ఎన్నికలకు సానుకూలంగా ఉంటే.. విపక్ష పాత్రను నిర్వహిస్తున్న కాంగ్రెస్ మాత్రం జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తోంది. జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని తక్కువ చేసి చూపుతాయని కాంగ్రెస్.. ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు సీపీఎం ఆరోపణలు చేసింది. జమిలి ఎన్నికల్ని నిర్వహిస్తే జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు పోటీ పడలేవని.. వ్యయం విషయంలోనూఅంతరాలు కనిపిస్తాయంటూ కీలక వ్యాఖ్యలు చేసింది సమాజ్ వాది పార్టీ. ఇక.. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో జమిలి అమలు సవాలుతో కూడుకున్నదిగా బీఎస్పీ పేర్కొంది.

జమిలి ఎన్నికలకు ఓకే చెప్పి మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు ఇవే

- ఏఐఏడీఎంకే

- ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్

- అప్నాదళ్ (సోనేలాల్)

- అసోం గణ పరిషత్

- బిజూ జనతాదళ్

- లోక్ జన్ శక్తి

- మిజో నేషనల్ ఫ్రంట్

- ఎన్ డీపీపీ

- శివసేన

- జేడీయూ

- సిక్కిం క్రాంతికారీ పార్టీ

- శిరోమణి అకాలీదళ్

- యూపీపీఎల్

ఈ పార్టీలు మద్దతు ఇస్తే.. మరికొన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తూ వ్యతిరేకిస్తున్నాయి. అలా వ్యతిరేకించే పార్టీల్ని చూస్తే..

- ఏఐయూడీఎఫ్

- టీఎంసీ (మమతా బెనర్జీ పార్టీ)

- ఏఐఎంఐఎం (మజ్లిస్)

- సీపీఐ

- డీఎంకే

- నాగా పీపుల్స్ ఫ్రంట్

- సమాజ్ వాదీ పార్టీతో పాటు మరికొన్ని వ్యతిరేకించాయి

జమిలి మీద ఎలాంటి స్పందన తెలియజేయని పార్టీలు ఉన్నాయి. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తెలుగు రాష్ట్రాల్లో అధికార.. విపక్షాలుగా వ్యవహరిస్తున్న ప్రధాన పార్టీలు ఈ కోవలోకి ఉండటం గమనార్హం.

- తెలుగుదేశం పార్టీ

- వైఎస్సార్ కాంగ్రెస్

- బీఆర్ఎస్

- ఐయూఎంల్

- ఎన్ సీ

- జేడీఎస్

- జేఎంఎం

- కేరళ కాంగ్రెస్

- ఎన్సీపీ

- ఆర్జేడీ

- రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ

- ఆర్ ఎస్పీ

- ఎస్డీఎఫ్.