Begin typing your search above and press return to search.

"నో షేవ్ నవంబర్" ట్రెండ్... దీని గురించి తెలుసా?

అవును... గత కొంతకాలంగా ప్రతీ ఏటా పదకొండో నెలను "నో షేవ్ నవంబర్" గా జరుపుకుంటారు.

By:  Tupaki Desk   |   1 Nov 2024 10:04 AM GMT
నో షేవ్  నవంబర్ ట్రెండ్... దీని గురించి తెలుసా?
X

చాలా మందికి గెడ్డాలు, మీసాలూ పెంచుకోవాలని కోరిక! అయితే.. ఇంట్లో తిడతారనో, గర్ల్ ఫ్రెండ్ వద్దని చెప్పిందనో, ఆఫీసుకి అలా వెళ్లడం బాగోదనో... కారణం ఏదైనా ఈ విషయంలో పలు సంకోచాలు చాలా మందిని వెంటాడుతుంటాయి. అయితే.. అలాంటివారు గెడ్డం, మీసం పెంచే ఆప్షన్ కి వెళ్లే నెల వచ్చేసింది. అదే నవంబర్ నెల!!

అవును... గత కొంతకాలంగా ప్రతీ ఏటా పదకొండో నెలను "నో షేవ్ నవంబర్" గా జరుపుకుంటారు. అయితే ఇది స్టైల్ కోసం కాదు సుమ... దీని వెనుక ఓ సామాజిక సందేశం ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఈ "నో షేవ్ నవంబర్" అంటే ఏమిటి.. దాన్ని ఎవరు ప్రారంభించారు.. దీన్ని ప్రారంభించడం వెనుకున్న నేపథ్యం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం...!

నో షేవ్ నవంబర్ అనేది నెల రోజుల వ్యవధిలో ఉంటుంది. ఇందులో భాగంగా.. నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకూ షేవింగ్, ట్రిమ్మింగ్ వంటివి చేయకుండా ఉంటారు. ప్రధానంగా పురుషులను ప్రభావితం చేసే ప్రోస్టేట్ & టెస్టిక్యులర్ క్యాన్సర్ పై అవగాహన కోసం దీని ఏర్పాటు చేశారు.

కీమో థెరపీ చికిత్స సమయంలో జుట్టును కోల్పోయే క్యాన్సర్ రోగులకు ఫండ్స్ కలెక్ట్ చేసి ఇవ్వడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు!ఇది ప్రపంచవ్యాప్త ఉద్యమం కాగా.. ఇదే పేరుతో ఓ సంస్థ దీన్ని ప్రారంభించింది. ఇది వెబ్ ఆధారతి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్!

క్యాన్సర్ తో బాధపడుతున్న మాథ్యూ అనే వ్యక్తి చికాగోలో 2007లో మరణించారు. దీంతో... ఆయన కుమారులు, కుమార్తె కలిసి క్యాన్సర్ అవగాహన, నివారణ, పరిశోధన కోసం నిధులు సేకరణ చేయాలని భావించి.. 2009లో ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే... వీరి ప్రయత్నం కాలక్రమేణా ఓ ఉద్యమంగా మారింది.

అయితే ఈ ఉద్యమంలో పురుషులు మాత్రమే పాల్గొంటారనుకుంటే పొరపాటే! ఈ నో షేవ్ నవంబర్ లో మహిళలు కూడా పాల్గొంటారు. ఇందులో భాగంగా... మహిళలు కూడా వ్యాక్సింగ్, ట్రిమ్మింగ్ లేదా థ్రెడింగ్ వంటి వాటి జోలికి కూడా వెళ్లారు. వాటికి ఖర్చయ్యే మొత్తాన్ని ఈ నో షేవ్ నవంబర్ కు పంపిస్తారు!