ఏపీలో విద్యావ్యవస్థ పై నోబెల్ గ్రహీత సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ తీసుకుంటున్న సంస్కరణలు, తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులు కూడా కళ్లుండి చూడలేనివారికి కనిపించడం లేదు.
By: Tupaki Desk | 8 Sep 2023 8:41 AM GMTరసగుల్లా ఎవరికైనా మధురంగానే ఉంటుంది ఒక షుగర్ వ్యాదిగ్రస్తులకు తప్ప.. మురళీనాదం ఎవరికైనా శ్రావ్యంగానే ఉంటుంది వినలేనివాళ్లకూ తప్ప.. పచ్చని ప్రకృతి ఎవరి మనసులనైనా పరవశింపజేస్తుంది ఒక్క చూడలేనివాళ్లకు తప్ప.. అదేవిధంగా... ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ తీసుకుంటున్న సంస్కరణలు, తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులు కూడా కళ్లుండి చూడలేనివారికి కనిపించడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సమయంలో తాజాగా... ఏపీలో ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యా సంస్కరణలు.. విద్యా వికాసానికి, విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధ, బాధ్యత ఖండాంతరాల్లోని మేధావులు, నిపుణులు, విద్యావేత్తలు అర్థం అవుతోందనే దానికి తాజా ఉదాహరణ వైరల్ గా మారింది.
అవును... ఏపీలో ఉన్న ఒకవర్గం మీడియాకు, విపక్షాలకూ అర్ధం కావడం లేదు అనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఐరాస సదస్సులో పాల్గొని తమ మేథోపటిమను విశ్వవ్యాప్తం చేసిన సంగతి తెలిసిందే. ఇది ఏపీలోని విద్యావ్యవస్థలో కనిపిస్తున్న జగన్ మార్కు మార్పు!
ఒక మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, మండల కేంద్రానికి వెళ్లి కొత్తవాళ్లతో మాట్లాడడమే గగనం అనే మాటలు వినిపించే రోజుల నుంచి... వారిలోని ఆత్మన్యూనతాభావం వారి నోటిని కట్టేస్తుందనే కంప్లైట్స్ ని ఎదుర్కొనే పరిస్థిత్ నుంచి.. నేడు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అంతర్జాతీయ వేదికల మీద అనర్గళంగా ఆంగ్లంలో ప్రసంగిస్తున్నారు. దీంతో ఇది కచ్చితంగా ఇది జగన్ మార్కు పాలనకు ఒక నిదర్శనం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
బడి పిల్లల బూట్లుపై కూడా సీఎం ప్రత్యేక శ్రద్ధ:
ఏదో పథకం మొదలెట్టాం.. పత్రికల్లో ప్రకటనలు గుప్పించాం.. ఇక అదే నడుస్తుంది కదా అని వదిలేసే రకం కాదు సీఎం జగన్ అనే మాటలు ఈమధ్య కాలంలో బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని లక్షలాది పిల్లలను తన సొంత బిడ్డల మాదిరి భావిస్తూ.. వాళ్ళు వేసుకునే బూట్ల దగ్గర్నుంచి తినే తిండి వరకు.. మోసే బ్యాగ్ నుంచి టాయిలెట్ల వరకూ అన్నీ దగ్గరుండి, ప్రత్యేక శ్రద్ధతో వాటిని ఎంపిక చేసి పిల్లలకు పంపిణీ చేస్తున్నారు వైఎస్ జగన్.
అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యాకానుక ఇలా ప్రతి పథకాన్ని సమర్థంగా అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలను నందనవనాలుగా తీర్చిదిద్దారనే పేరు సంపాదించుకున్న జగన్ పాలనకు వివిధ రాష్ట్రాలు సైతం అభినందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇప్పుడు ఏకంగా నోబెల్ అవార్డ్ గ్రహీత, చికాగో యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ మైకేల్ రాబర్డ్ క్రేమెర్ సైతం ఏపీలోని విద్యాశాఖ పని తీరు చూసి అబ్బురపడ్డారు.
అవును... డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ డైరెక్టర్ కూడా అయిన మైకేల్ రాబర్డ్ క్రేమెర్ మన రాష్ట్రంలోని వివిధ పాఠశాలలను సందర్శించారు. ఈ సమయంలో పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలు, ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను చూసి ముచ్చటపడ్డారు. విద్యార్థుల మనోవికాసానికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని, ఇలాంటి సంస్కరణలే విద్యార్థులను సమున్నతంగా తీర్చిదిద్దుతాయని అయన కొనియాడారు.
ఇదే సమయంలో... ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొచ్చిన మార్పులు, విద్యార్థులు సాధిస్తున్న ప్రగతి నిజంగా కళ్ళముందు కనిపిస్తున్న ఓ అద్భుతమైన మార్పు అని ఈ సందర్హంగా ఏపీ సర్కార్ పనితీరుని కొనియాడారు. దీంతో సాక్ష్యాత్తు నోబెల్ అవార్డు గ్రహీతలు వాస్తవాలు గ్రహించి, అర్ధం చేసుకుని స్పందించడం, అభినందించడం నిజంగా రాష్ట్రప్రభుత్వానికి ఒక ప్రోత్సాహంతో కూడిన అభినందన అని అంటున్నారు పరిశీలకులు.