అవిశ్వాస తీర్మానం : మోడీ లైట్ తీసుకున్నారా...?
మోడీ ప్రభుత్వం అవిశ్వాసాని లైట్ గా తీసుకుంటోందా లేక సీరియస్ గానే చూడాల్సిందే.
By: Tupaki Desk | 26 July 2023 12:31 PM GMTవిపక్షాలు చివరికి తన వద్ద ఉన్న బ్రహ్మాస్త్రంగా అవిశ్వాస తీర్మానాన్ని మోడీ సర్కార్ మీద ప్రయోగించాయి. ఏ ప్రభుత్వం మీద అయినా విపక్షాలు చేసే అతి పెద్ద పని అదే. ఈ ప్రభుత్వం మాకు వద్దు అంటూ విపక్షాలు తీర్మానం ఇవ్వడం అంటే ఒక విధంగా అధికార పక్షానికి ఇబ్బంది కలిగించేదే. అయితే ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి.
అవిశ్వాసం తీర్మానం రాజకీయంగా నైతికంగా గురి పెట్టడం. అలాగే జనాల ఫోకస్ ని తమ వైపు తిప్పుకునే ఎత్తుగడతో ప్రవేశపెట్టడం. రాజకీయంగా అవిశ్వాసం అంటే అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య సీట్ల తేడా పెద్దగా లేకపోయినా అటూ ఇటూ జంపింగ్ జఫాంగులు ఎవరైనా దూకేందుకు ఆస్కారం కలిగినా అపుడు అవిశ్వాసం ప్రవేశపెట్టి రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు చూస్తారు.
అయితే విపక్షాలు ఇపుడు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం వల్ల మోడీ ప్రభుత్వానికి వచ్చిన ముప్పు ఏమీ లేదు ఎన్డీయే కు పార్లమెంట్ లో ఏకంగా 332 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇక ఇండియా పేరిట కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి 142 మంది సభుల మద్దతు ఉంది. ఏ పార్టీకిచ్ చెందని పార్టీలకు 62 మంది ఎంపీలు ఉన్నారు. అయితే వారూ వీరూ అంతా కలైనా కూడా మోడీ సర్కార్ కి ఏమీ కాదు.
ఆ లెక్క స్పష్టంగా తేలిపోతోంది. మరి ఎందుకు ఈ తీర్మానం అంటే మోడీ ప్రభుత్వాన్ని నైతికంగా దెబ్బ కొట్టడం. అంటే డీ మోరలైజ్ చేయడం అన్న మాట. ఇక ప్రజల ఫోకస్ కూడా తమ వైపు తిప్పుకునే వ్యూహం కూడా ఇందులో ఉంది. ఈ రెండూ సాధించాలని విపక్షం అవిశ్వాసం ప్రవేశపెడుతోంది. అయితే దీన్ని మోడీ ఎలా తీసుకుంటారు అన్నదే ఇక్కడ కీలకం.
మోడీ అయితే దీన్ని లైట్ గానే తీసుకుంటారు అని అంటున్నారు. మోడీ ప్రభుత్వం మీద 2018లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అపుడు ఆయన ఏమన్నారు అంటే 2023లో కూడా తన మీద మళ్లీ ఇవే ప్రతిపక్షాలు మళ్లీ అవిశ్వాసం ప్రవేశపెడతాయని. అంటే దాని ఉద్దేశ్యం ఏంటి అంటే ఎన్నికలకు ఏడాది లోపు వ్యవధి ఉండగా విపక్షాలు ప్రభుత్వం మీద అవిశ్వాసం పేరుతో బురద జల్లుతాయని, అలా రాజకీయం చేస్తూ తాము హైలెట్ కావాల ని చూస్తాయని.
అంటే ఇలాంటి అవిశ్వాస తీర్మానాల ను ఆయన ముందే ఊహించారు అని అనుకోవాలి. అంతే కాదు ఆయన విపక్షాల అవిశ్వాస తీర్మానం వెనక డొల్లతనాన్ని కూడా 2018లో అలా ఎండగట్టారు. మరి 2023లో కూడా మళ్ళీ ఇలాంటివి వస్తాయని ఊహించి చెప్పారు అంటే విపక్షాల కు అవిశ్వాసం పెట్టడం వెనక సీరియస్ అజెండా ఏమీ లేదని కేవలం రాజకీయమే తప్ప అన్నది 2018లో ఆయన మాటల ను బట్టి అర్ధం చేసుకోవాలని అంటున్నారు.
ఇక అవిశ్వాసం మీద చర్చించడానికి ఒక డేట్ ఇస్తారు. అన్ని పక్షాల కు చర్చించే అవకాశం ఇస్తారు. చివరిగా ప్రధాని సమాధానం ఇస్తారు. అపుడు ప్రధానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఆయన 2018లో కూడా దాదాపుగా రెండు గంటల కు పైగా అవిశ్వాస తీర్మానం మీద మాట్లాడి విపక్షాల ను చీల్చి చెండాడారు. మరి ఇపుడు ఈ విధంగా ప్రధానికి అవకాశం విపక్షాలు కల్పించాయా అన్నది ఒక మాటగా ఉంది.
అదే సమయం లో చూస్తే విపక్షాల కు దీని వల్ల రాజకీయ లాభం ఏంటి అంటే మండుతున్న మణిపూర్ సమస్యను మొత్తం భారత జాతి జనుల ముందు పెట్టి మరీ మోడీ సర్కార్ ని ఎండగట్టడం. నిజానికి మణిపూర్ సున్నితమైన అంశంగా ఉంది. ప్రజల లో అది పెద్ద చర్చకు దారి తీస్తోంది. మోడీ సర్కార్ తమ పాలనలో ఉగ్రవాదం లేదని చెప్పుకోవచ్చు. కాశ్మీర్ సమస్య స్మూత్ గా సాల్వ్ చేశామని కూడా ప్రచారం చేసుకోవచ్చు.
కానీ మణిపూర్ ఇష్యూ మాత్రం బీజేపీ ని ఇబ్బంది పెట్టేదే. అక్కడ మానవీయత, మానవ విలువలు మంటకలుస్తున్న తీరు జాతీయంగా అంతర్జాతీయంగా చర్చ సాగుతున్న నేపధ్యం చూసే విపక్షం అవిశ్వాసం నోటీసులు ఇచ్చింది. ఈ చర్చలో అన్ని పార్టీల సభ్యులూ మణిపూర్ అంశాన్ని ముందుకు తెచ్చి మోడీ సర్కార్ ని పూర్తి స్థాయిలో ఎండగడతాయి.
మరి దానికి ధీటైన జవాబు మోడీ సర్కార్ నుంచి ఏ విధంగా ఉంటుంది అన్నది చూడాల్సి ఉంది. అదే సమయంలో రాజకీయంగా ఈ తీర్మానన్ని ఓడించి మోడీ సర్కార్ సంతృప్తి పడవచ్చు కానీ నైతికంగా టార్గెట్ చేస్తే మాత్రం జవాబు ఏమ ని చెబుతోంది అన్నది చచగా ఉంది. మొత్తానికి మోడీ ప్రభుత్వం అవిశ్వాసాని లైట్ గా తీసుకుంటోందా లేక సీరియస్ గానే పరిగణించి ధీటైన జవాబులతో ముందుకు వస్తుందా అన్నది చూడాల్సిందే.