Begin typing your search above and press return to search.

అర్థరాత్రి వేళ జూబ్లీహిల్స్ పోలీసులు వారి తాట తీశారు

శనివారం అర్థరాత్రి వేళ నిర్వహించిన ఈ తనికీల్లో పెద్ద ఎత్తున వాహనాల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   23 Feb 2025 4:49 AM GMT
అర్థరాత్రి వేళ జూబ్లీహిల్స్ పోలీసులు వారి తాట తీశారు
X

వాహనాల్ని సీజ్ చేసినా.. కేసులు నమోదు చేసినా.. పెద్దగా పట్టించుకోని ఒక బ్యాచ్ తరచూ హైదరాబాద్ రోడ్ల మీద ఆగమాగం చేయటం తెలిసిందే. ఖరీదైన టూవీలర్ల సైలెన్సర్ పీకేసి.. రోడ్ల మీద ఇష్టారాజ్యంగా నడుపుతూ.. పెద్ద శబ్ధంతో రోడ్ల మీద వెళ్లే ఇతరులకు తీవ్ర అసౌకర్యంతో పాటు.. భయభ్రాంతులకు గురి చేసే కుర్రాళ్ల గురించి తెలిసిందే. పలుమార్లు నిర్వహించిన తనిఖీల్లో వీరికి పెద్ద ఎత్తున ఫైన్ విధించినా వారి తీరులో మార్పు వచ్చింది లేదు.

ఇదిలా ఉండగా తాజాగా మరోసారి జూబ్లీహిల్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శనివారం అర్థరాత్రి వేళ నిర్వహించిన ఈ తనికీల్లో పెద్ద ఎత్తున వాహనాల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. సైలెన్సర్లను తీసేయటం.. పెద్ద ఎత్తున శబ్దాలకు పాల్పడుతూ.. శబ్ద కాలుష్యంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించే పలు వాహనాల్ని పోలీసులు సీజ్ చేశారు.

జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ లో పెద్ద ఎత్తున వాహనాల్ని గుర్తించి సీజ్ చేశారు. ఈ వాహనాల నెంబర్ ప్లేట్లను కవర్ చేయటం.. కనిపించకుండా చేయటం లాంటి చేష్టలకు పాల్పడుతున్న వైనాన్ని పోలీసులు గుర్తించారు. మొత్తం 30 వాహనాల్ని పోలీసులు సీజ్ చేశారు. అప్పుడప్పుడు కాకుండా తరచూ ఈ తరహా డ్రైవ్ లను నిర్వహించాలని.. మహానగరంలో ఏదో ఒక ప్రాంతంలో కాకుండా.. మరిన్ని చోట్ల నిర్వహిస్తే ఈ తరహా అతి బ్యాచ్ చేష్టలకు చెక్ పెట్టే వీలుందన్న మాట వినిపిస్తోంది.